కత్రినాకు మేల్‌ వర్షన్ మహేష్ బాబు!

టాలీవుడ్ లో ఈ జనరేషన్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు మహేష్ బాబు. కేవలం స్టార్‌ ఇమేజ్‌ మాత్రమే కాదు నటుడిగానూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు మహేష్. ఈ జనరేషన్‌ నటుల్లో అత్యధిక నంది అవార్డులు అందుకున్న నటుడు కూడా మహేషే. ఇలాంటి ఓ టాప్‌ స్టార్‌పై ఓ తమిళ వ్యక్తి నోరు పారేసుకున్నాడు. తమిళనాట స్టాండప్‌ కమెడియన్‌గా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న మనోజ్‌ ప్రభాకర్‌ పబ్లిసిటీ కోసం మహేష్ బాబు నటన మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

స్పైడర్‌ సినిమాలో మహేష్‌, ఎస్‌జే సూర్యల నటనను పోలుస్తూ ‘మహేష్ బాబు కు అసలు నటనే రాదు, ఆయనది రాక్‌ ఫేస్‌.. స్పైడర్‌ సినిమాలో ఎస్‌జే సూర్య అద్భుతంగా నటిస్తుంటే హీరో మహేష్ మాత్రం ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా అలా చూస్తుండిపోయాడు’ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు స్క్రీన్‌ మీద పెద్దరాళ్లను చూపిస్తూ మహేష్ బాబు ముఖాన్ని ఆ రాళ్లతో పోల్చి జోకులు పేల్చాడు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కూడా నటన రాదన్న మనోజ్‌, మహేష్ బాబును కత్రినాకు మేల్‌ వర్షన్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో సూపర్‌ స్టార్ అభిమానులు మనోజ్‌ ప్రభాకర్‌పై ఫైర్‌ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మనోజ్‌ ప్రభాకర్‌పై యుద్ధం ప్రకటించారు ఫ్యాన్స్. తప్పు తెలుసుకున్న మనోజ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మనోజ్‌ ప్రతీ పోస్ట్‌పై వేల కామెంట్స్‌ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

Total Views: 948 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

చాటుగా కోర్టుకు హాజరైన బండ్ల గణేష్!

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నిన్న ప్రొద్దుటూరు కోర్టుకు