గులాబీ శిబిరంలో ఆ నలుగురు : ఎవరా నలుగురు ఏంటా కథ ?

ఒకరేమో మాజీ మంత్రి, రాజకీయ దురందరుడు..మరొకరేమో ఆ నగర మేయర్‌…ఇంకొకరేమో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు.. చివరి పెద్ద మనిషి మాత్రం గత ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయిన నేత.. వీరంతా ప్రస్తుతం గులాబీ శిబిరంలోనే ఉన్నారు. ఈ నలుగురు కీలక నేతలు… టికెట్ పోరులో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు… ఎవరా నలుగురు ఏంటా కథ అనుకుంటున్నారా వాచ్‌ దిస్‌ స్టోరి…

గులాబీ పార్టీ అధినేత కెసిఆర్‌ రాష్ట్ర రాజకీయాలను తనదైన శైలిలో శాసిస్తున్నారు. అసెంబ్లీని ఎనిమిది నెలల ముందే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపారు. సెప్టెంబర్‌ ఆరున మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇక అదే రోజు టిఆర్‌ఎస్‌ తరుపున ఎన్నికలలో పోటీచేసే 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కెసిఆర్‌ అందరిని ఆశ్చర్యంలో ముంచారు. మరో 14 స్థానాలను పెండింగ్‌ లో ఉంచారు. ఇద్దరు సిటింగ్‌ ఎమ్మెల్యేలకు ఆయన టికెట్‌ నిరాకరించారు. పెండింగ్‌ లో ఉన్న వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండ దంపతులకు టిఆర్‌ఎస్‌ అధిష్ఠానం మొండిచెయ్యి చూపింది. దీంతో వారు ఆ పార్టీని వదిలి హస్తం గూటికి చేరుకున్నారు..

వరంగల్‌ తూర్పు సిటింగ్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ మారడంతో ఆ టికెట్‌ ను దక్కించుకునేందుకు స్థానిక నేతలు రంగంలోకి దిగారు. వరంగల్‌ నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ కొండా దంపతులతో రాజకీయంగా ఢీ కొట్టారు. తూర్పు నియోజకవర్గ కార్పోరేటర్లు ముఖ్య నాయకులను కొండా దంపతుల వెంట వెళ్లకుండా కట్టడి చేశారు. గత ఎన్నికలలో తనకు టిఆర్ఎస్‌ అధిష్ఠానం టికెట్‌ ఇస్తానని హమీ ఇచ్చిందని…ఐతే చివరి నిమిషంలో కొండా దంపతులు పార్టీలోకి రావడంతో వారి కోసం తన సీటును త్యాగం చేశానని నరేందర్‌ అంటున్నారు. మేయర్‌ గా కొనసాగుతున్న నరేందర్‌ ను వరంగల్‌ తూర్పు నుండి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించాలని కెటిఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనకు ఈ విషయాన్ని స్పష్టం చేసిన పార్టీ అధిష్ఠానం తూర్పులో పనిచేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుండి వరుసగా నాలుగుసార్లు పోటీచేసి మూడు సార్లు విజయం సాదించిన మాజీ మంత్రి బస్వరాజ్‌ సారయ్య తనకు టికెట్‌ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు..కెసిఆర్‌ కు సన్నిహితంగా ఉంటూ ఆయన సీటు కోసం ప్రత్నిస్తున్నారు. గత ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికి ఆయన ప్రజల మద్యే ఉంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం తనకు కలసి వస్తుందనే నమ్మకంతో సారయ్య ఉన్నారు. 2001 నుండి పార్టీలో కొనసాగుతున్న గుడిమళ్ల రవికుమార్‌ కూడ తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు…వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల సమయంలో ఎంపి అభ్యర్థిగా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిందని గుర్తు చేస్తున్నారు.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు కూడ టిఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారం చేస్తున్నారు. టిఆర్ఎస్ టికెట్‌ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్‌గా నైనా బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేస్తున్నారు. కొండా సురేఖను వరంగల్‌ తూర్పు టిఆర్ఎస్‌ నుండి పంపించడంలో ప్రదీప్‌ రావు కీలక పాత్ర పోషించారు. ఇక మాజీ ఎంపిగా మహిళ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ గా ఉన్న గుండు సుధారాణి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టిఆర్‌ఎస్‌ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. గతంలో రెండు సార్లు ఇక్కడి నుండి పోటీ చేసిన అనుభవం ఉందని బిసి మహిళగా ఉన్న సురేఖ స్థానంలో తనకు అవకాశం ఇస్తే ఆ లోటు తీరుతుందని చెబుతున్నారు. తన అనుచరులతో సమావేశమవుతూ టికెట్‌ తనకే వస్తుందని చెబుతున్నారు.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గ సమన్వయ బాధ్యతను డిప్యూటి సిఎం కడియం తీసుకున్నారు. నలుగురిని ఏకతాటిపైకి తీసుకవచ్చేలా ఆయన క్రుషి చేస్తున్నారు. ఎవరికి వారే సీటు ప్రయత్నాలు చేస్తున్న నేతలు మాత్రం మాలో ఎవరికి టికెట్‌ వచ్చినా పార్టీ గెలుపుకు క్రుషి చేస్తామని పైకి చెబుతున్నారు…ఎవరికి టికెట్‌ ఇచ్చిన మిగిలిన ముగ్గురు సహకరిస్తారా అన్న అనుమానాలు మాత్రం పార్టీ క్యాడర్‌ ను వెంటాడుతున్నాయి.

Total Views: 182 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే