ఆ జిల్లాలో ఫ్యాన్ గాలికి పూర్వ వైభవం వస్తుందా!

రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు జిల్లాలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే. ఇందుకు కారణం జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం గల కుటుంబాలుండటమే కారణం. 2014 ఎన్నికల్లో టీడీపీ-వైసీపీ మధ్య గట్టి పోటీయే జరిగింది. జిల్లాలో కర్నూలు నంద్యాల పార్లమెంటు సీట్లు.. 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో వైసీపి రెండు ఎం.పిలతో పాటు.. 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెండా ఎగరేసింది. రాష్ట్రమంతా సైకిల్ స్పీడుగా దూసుకెళ్తే ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రం ఫ్యాన్ గాలి ఊహించని విధంగా వీచింది.

అయితే జిల్లాలో అత్యధిక స్థానాలు వైసీపి కైవసం చేసుకున్నా.. నేతలు సైకిల్ ఎక్కేశారు. నంద్యాల ఎంపీ ఎస్.పీ.వై.రెడ్డి, ఆ తరువాత అప్పటి నంద్యాల ఎం.ఎల్.ఎ.దివంగత నేత భూమా నాగిరెడ్డి ఆయన కూతరు అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీమోహన్ రెడ్డి, కొడుమూర్ శాసనసభ్యులు మనిగాంధి తెలుగుదేశం పార్టీలో చేరారు. బుట్టా రేణుక కూడా టీడీపీ గూటికి చేరారు. ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు టీడిపిలోకి వెళ్లడంతో వైసీపి కోలుకోని విధంగా దెబ్బతింది. ఫలితంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో వైసీపికి బలమైన నేతలు కరువయ్యారు.

దీంతో ఆయా నియోజక వర్గాల్లో బలమైన నాయకుల వేటలో పడింది వైసీపీ. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకత్వాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి, బుడ్డా శేషారెడ్డి,కర్నూల్లో హఫీజ్ ఖాన్, ఆళ్లగడ్డలో గంగుల నాని, నంద్యాల్లో శిల్పా మోహన్ రెడ్డి పార్టీ ఇంఛార్జి బాధ్యతలు తీసుకున్నారు. నంద్యాల్లో శిల్పా బ్రదర్స్ బలంగా ఉన్నా కర్నూలు పార్లమెంట్ పరిధిలో టీడిపికి గట్టి పోటీ ఇచ్చే పట్టున్న నేతలు కరువయ్యారు. దీంతో ఎన్నికల సమయం నాటికంతా పార్టీకి పూర్వ వైభవం తీసుక రావాలని చూస్తున్నారు అధినేత జగన్. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే భారీ చేరికలు ఉంటాయని శ్రేణులు అంటున్నాయి. అయితే ఎవరనేది మాత్రం పేర్లు బయటపెట్టడం లేదు. మరి వైసీపీకి మళ్లీ ఇక్కడ పూర్వవైభవం వస్తుందా? ఇప్పటికే టీడీపీ ఆయా వర్గాలకు చేరువయ్యేందుకునాయకులకు పదవులు కూడా కట్టబెట్టింది. అధికార పార్టీ వ్యూహాలను తట్టుకుని నిలబడి పార్టీకి బలంగా మారే నాయకుల వేట ఫలిస్తుందా?చూడాలి.

Total Views: 227 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే