సీఎం హోదాలో చంద్రబాబు అలా మాట్లాడొచ్చా?

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొంచం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏపీలోని పలువురు మంత్రులపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్టు యెల్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్త చూస్తే కొంచం ఆశ్చర్యంగానూ .. ఆలోచించే విధంగానూ అనిపించింది.

మీ పై ఐటీ దాడులు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అంటూ సినిమాల్లో విలన్ కి ఐటీ ఆఫీస్ నుంచి సంబంధిత వ్యక్తులు చెప్పటం మనం చూస్తూ ఉంటాం. ఆ వెంటనే ఆ విలన్ ఆయనకు దగ్గర వ్యక్తులకు ఆ విషయం చేరవేసి . తన అక్రమ సంపాదన అంతా ఐటీ అధికారులకు దొరకకుండా దాచేస్తూ ఉంటారు. సినిమాల్లో అయితే ఈ సీన్ బాగా రక్తి కట్టిస్తుంది కూడా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే సాక్షాత్తు సీఎం సోదాలో చంద్రబాబు నాయుడు తన మంత్రులకు ఐటీ దాడులు జరుగుతాయి జాగ్రత్త ఉండండి అని చెప్పటం ఎలా చూడాలి? ఎలా అర్ధం చేసుకోవాలో తెలియయటం లేదు అంటూ సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

సహజంగా చంద్రబాబు ఏ బహిరంగ సభలో మాట్లాడిన టీడీపీ అవినీతికి ఆమడ దూరం ఉంటాం అని మాట్లాడతారు. మరి ఆమడ దూరంలో ఉంటె ఐటీ దాడులుకి భయపడాల్సిన అవసరం ఏంటి ? తన కేబినెట్ మంత్రులకు హెచ్చరికలు జారీచేయాల్సిన అవసరం ఏంటి ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రతి సామాన్యుడిని తొలిచివేస్తున్నాయి. దీనికి అర్ధం ఏంటో ఆ చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి లేదా? లీకుల పేరుతో వార్తలను ప్రచారం చేసే యెల్లో మీడియా చెప్పాలి.

Total Views: 122 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా