ఒక్కసారి ఆలోచించండి : జగన్

జగన్ వెనుక మరో రాజకీయ కుట్ర జరుగుతుందా? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లీకులు యెల్లో మీడియా కు మాత్రమే ఎలా వచ్చింది? వైస్ భారతికి కేసులతో సంబంధం ఏంటి? ఆమెను కూడా కోర్టులకు తిప్పాలని చూస్తున్నారా? టీడీపీ కుట్రలో భాగంగానే ఈ లీకులు నడుస్తున్నాయా? రాష్ట్రంలో ఏ నోటా విన్న ఇదే చర్చ..!

ఇదే అంశంపై జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా టీడీపీ, కాంగ్రెస్ కలిసి కేసులు వేసి అన్యాయంగా జైళ్లో పెట్టినా, కోర్టుల చుట్టూ తిప్పుతున్నా ఏనాడూ బయపడలేదని, కానీ ఇవాళ భారతిని కూడా కోర్టుల చుట్టూ తిప్పాలని చూస్తున్నారని ఇది దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని జగన్ అభిప్రాయపడ్డారు.తనపై, తన కుటుంబంపై ఇంతటి శతృత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

# ఛార్జి షీట్ ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే, కనీసం తమకు తెలియక ముందే ఈ విషయం బయటకు ఎలా తెలిసింది. కొన్ని పత్రికలు ఇలా ప్రచురించడం చూసి షాకయ్యాను.
# సీబీఐ విచారణలో లేని అంశాలను ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఎలా చేర్చారు.
ఈడీలో చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేసే ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే అధికారులు తనను వేధిస్తున్నారు. ఈ విషయంపై 17 నెలల క్రితమే ప్రధానికి లేఖ రాశాను.
# సదరు అధికారుల కాల్ డెటా పరిశీలిస్తే చంద్రబాబు కుట్ర బయటపడుతుందని, గాంధీ అనే అధికారి అసాధారణంగా మూడుసార్లు పదవీకాలాన్ని పొడిగించుకుని మరీ ఈడీలో కొనసాగుతున్నారు.
#మామీద బురద జల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది..? భారతికి ఈ కేసులతో ఏమి సంబంధం ఉంది..?
# ఏడేళ్ల క్రితం 2011, ఆగస్టు 10వ తేదీన అన్యాయంగా తనపై కేసులు నమోదు చేసి అక్రమంగా జైల్లో పెట్టారని, ఇప్పుడు మళ్లీ అదే రోజు తన కుటుంబంపై కక్షసాధింపు చేస్తున్నారు.
# ఈ పరిణామాలతో బీజేపీతో టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు.
#ప్రత్యర్థి పక్షాన్ని ప్రజల్లో ఎదుర్కోలేక వ్యవస్థల ద్వారా దెబ్బతీసి చంద్రబాబు అధికారంలో కొనసాగాలనుకుంటున్నారు.
#నాడు నా తండ్రిని, తర్వాత న్ను చంద్రబాబు టార్గెట్ చేశారు. ఇప్పుడు నా భార్యను టార్గెట్ చేస్తున్నారు.
#తొమ్మిదేళ్లుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల తరుపున పోరాడుతున్నానని, ఆనాడు సమైక్యాంద్ర కోసం, నేడు ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నాము. కానీ, చంద్రబాబు బయట పోరాటం చేస్తున్నట్లు నటిస్తూ లోపల లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు.

ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది .. రాజకీయాల్లో గెలుపోటములే తప్ప ఏ పార్టీకి నైతిక విలువలతో పనిలేని రోజులివి.ఇక్కడ నాయకుల క్రెడిబులిటీ తోనే ప్రధాన సమస్య. యెల్లో మీడియా భుజం మీద గన్‌పెట్టి.. ఈడి ఎవర్ని కాల్చాలనుకుంటున్నారో తెలియనంత అమాయకత్వాలు ప్రజలవి కావని గుర్తెరిగితే అదే చాలు. ఛార్జ్ షీట్ లో తన పేరు పెట్టిన విషయం ఆమెకు తెలియకముందే ఎల్లో మీడియాకు ఎలా లీకైందని అన్నది ఇక్కడ సూటి ప్రశ్న.ఈ లీకుల వెనుక ఎవరి హస్తం ఉందో.. జనం ఏమాలోచిస్తున్నారో లీకులు ఇచ్చినవారికి తెలియదంటే.. అది వారి అయామకత్వమే అవుతుంది!

Total Views: 187 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే