విశాఖ మహిళా నేతలు మళ్ళీ గెలుస్తారా?

ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు మహిళల్లో ఒకరు అరకు ఎంపీ కొత్తపల్లి గీత. మరొకరు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. ఇంకొకరు.. వంగలపూడి అనిత. వీరి ముగ్గురికి ఓ సారూప్యత ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఈ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే. ఎంతోకష్టపడి ప్రభుత్వ కొలువు సంపాదించి.. ఏళ్ల తరబడి సేవలు అందించారు. 2014లో అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒకసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. రెవెన్యూ అధికారిణిగా ఉన్న కొత్తపల్లి గీత 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం అరకు ఎంపీగా ఆమెను నిలబెట్టారు జగన్. ఇక ఉపాధ్యాయురాలిగా, యూనియన్ లీడర్గా మంచి పేరు తెచ్చుకున్న గిడ్డి ఈశ్వరి కూడా వైపీపీ తరపున పాడేరు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. ఇక అనిత విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. టీడీపీ తీర్ధం పుచ్చుకుని పాయకారావుపేట నుంచిఎమ్మెల్యే అయ్యారు. ఒకే జిల్లాలో ముగ్గురు మాజీ అధికారులు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం అప్పట్లో సంచలనం. ఇంతవరకూ బాగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంత పేరు సంపాదించారో… రాజకీయాల్లో కూడా రాణిస్తారని ఊహించారు. కానీ వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

అసెంబ్లీలోనూ, బయటా తనదైన విమర్శలతో ప్రత్యర్ధులను ఇరుకునపెట్టే అనిత వాయిస్ మూగబోయింది. మొదట్లో పార్టీకి బలమైన గొంతుక అయిన అనిత.. ఇప్పుడు బలహీనత అయ్యారు. ఆమె చేసిన పొరపాటు మొత్తం పార్టీనే ఇరుకున పడేసింది. ఆమె అవకాశాలను కాలరాసింది. మతం విషయంలో ఆమెపై ఆరోపణలు ఇబ్బంది పెట్టాయి. ప్రతిష్టాత్మక టీటీడీ మెంబర్ గా ప్రకటించిన వెంటనే.. తనను తాను క్రిస్టియన్ అని చెప్పుకున్న అనిత పాత వీడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇతర పార్టీలు చంద్రబాబును సైతం టార్గెట్ చేశాయి. దీనిపై విచారణకు ఆదేశించిన చంద్రబాబు ఆమెను టీటీడీ బోర్డు సభ్యుల జాబితా నుంచి తొలగించారు.సెంటిమెంట్ అంశం కావడంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయింపు విషయంలో ఇదే అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది.

అరకులోయ ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత.. గెలిచిన మూణ్ణాళ్లకే పార్టీ మారారు. అక్కడితో ఆగకుండా ఆమె కొంతకాలం క్రితం బీజేపీ సానుభూతిపరురాలుగా మారారు. మోడీని కలిసి.. తన భక్తిని చాటుకున్నారు. ఆమె ఈ నిర్ణయం తీసుకున్న కొద్దిరోజులకే ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. మోడీ మాట తప్పారన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. ఇది గీత రాజకీయ జీవితాన్ని గందరగోళంలో పడేసింది. అటు వైసీపీలో అవకాశం. టీడీపీ నమ్మె పరిస్థితి లేదు. ఇప్పుడు బీజేపీకి ఓటుబ్యాంకు లేదు.

అటు పాడేరు నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరి కూడా పార్టీ మారడం ప్రతికూలంగా మారింది. వైపీపీలో తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని.. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని టీడీపీలో చేరారు. చంద్రబాబు చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు. పార్టీ మారితే మంత్రి పదవి వస్తుందని.. ఆమె సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ప్రత్యర్ధులకు వరంగా మారాయి. కానీ ఆమెకు మంత్రి పదవి రాలేదు.. టీడీపీలో స్థానిక నాయకత్వంతో ఇమడలేక సతమతమవుతున్నారు. అలాగని సొంతగూటికి వెళ్లే పరిస్థితి లేదు. ఇలా రెంటికి చెడ్డ రేవడిలా మారింది గిడ్డి ఈశ్వరి రాజకీయం.

Total Views: 258 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే