జనసేనలోకి వెళ్తున్న చదలవాడ చరిత్ర ఇది!

తిరుపతిలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు పార్టీలు మారుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా తిరుపతికి చెందిన మాజీ ఎమ్మెల్యే చదలవాడక్రిష్ణమూర్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ను కలవడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీ నుంచి తిరుపతి అభ్యర్థిగా చదలవాడక్రిష్ణమూర్తి రంగంలోకి దిగడం దాదాపు ఖాయమైంది.

చదలవాడక్రిష్ణమూర్తి. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. నెల్లూరుజిల్లాలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు చదలవాడ. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చదలవాడక్రిష్ణమూర్తి నాయుడుపేట మండలాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆ తరువాత తిరుపతికి వచ్చేసిన చదలవాడక్రిష్ణమూర్తి వ్యాపారంలో బిజీగా మారిపోయారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 1989ఎన్నికల్లో తిరుపతి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. చివరకు శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చదలవాడక్రిష్ణమూర్తికి కల్పించింది. అయితే ఆ ఎన్నికల్లో బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు చదలవాడ క్రిష్ణమూర్తి. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోనే 1993 సంవత్సరం వరకు కొనసాగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉన్న పదవులను ఇవ్వాలని చదలవాడ క్రిష్ణమూర్తి కోరారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో 1994సంవత్సరంలో తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అప్పటి నుంచి టిడిపిలో కొనసాగుతూ వచ్చిన చదలవాడక్రిష్ణమూర్తి 1999ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2003సంవత్సరం అక్టోబర్ 1వతేదీన అలిపిరి వద్ద జరిగిన బాంబుదాడిలో చంద్రబాబునాయుడుతో పాటు చదలవాడక్రిష్ణమూర్తి కూడా ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో సఖ్యతగా ఉంటూ వచ్చిన చదలవాడక్రిష్ణమూర్తి 2004సంవత్సరంలో టిడిపి తరపున ఎమ్మెల్యే సీటు తనకే అన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికల సమయంలో తన బామర్థి ఎన్వీప్రసాద్ ను వెంటపెట్టుకుని హైదరాబాద్ కు వెళ్ళారు చదలవాడక్రిష్ణమూర్తి. అయితే అంతకు ముందే ఎన్వీ ప్రసాద్ పార్టీ అధినేత చంద్రబాబుతో తనకు సీటివ్వాలని రెకమెండేషన్ చేయించుకున్నాడు. దీంతో ఎన్వీప్రసాద్ కు చంద్రబాబు బి.ఫారం ఇచ్చేశారు. బావ చదలవాడక్రిష్ణమూర్తికి తెలియకుండానే బామర్థి ఎన్వీప్రసాద్ బీ-ఫారం తీసుకుని తిరుపతికి వచ్చేశారు. దీంతో బావబామర్థిలకు మధ్య రచ్చ మొదలై కుటుంబం కాస్త రెండుగా విడిపోయింది. ఆ తరువాత ఇప్పటి వరకు కలవనేలేదు. వీరి మధ్య తగాదాలు ఎలా ఉన్నా చదలవాడక్రిష్ణమూర్తి మాత్రం తెలుగుదేశంపార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.

2014సంవత్సరంలో తిరుపతి ఎమ్మెల్యే సీటు తనకే అన్న ధీమాలో ఉన్న చదలవాడక్రిష్ణమూర్తికి చేధు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న వెంకటరమణ టిడిపిలోకి జంప్ అవ్వడమే కాకుండా టిడిపి అధిష్టానంతో సంప్రదింపులు జరిపి సీటును కన్ఫామ్ చేసుకున్నారు. దీంతో చదలవాడక్రిష్ణమూర్తికి అధినేత చంద్రబాబునాయుడుపై కోపమొచ్చింది. పార్టీతో పాటు అధినేతపై అలకపాన్పు ఎక్కారు చదలవాడక్రిష్ణమూర్తి. పార్టీలో సీనియర్ గా ఉన్న చదలవాడను స్వయంగా చంద్రబాబు బుజ్జగించారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే టిటిడి ఛైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల సమయంలో వెంకటరమణకు పూర్తిస్థాయిలో చదలవాడక్రిష్ణమూర్తి సహకరించలేదన్న ఆరోపణలు లేకపోలేదు. వెంకటరమణను ఓడించడానికి చదలవాడ క్రిష్ణమూర్తి ప్రయత్నించారన్న విమర్సలు వినిపించాయి. ఇదంతా అధినేత దృష్టికి వెళ్ళింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ చాలా ఆలస్యంగా టిటిడి ఛైర్మన్ పదవిని 2015సంవత్సరంలో చదలవాడక్రిష్ణమూర్తికి వచ్చారు. రెండు సంవత్సరాల పాటు చదలవాడ టిటిడి ఛైర్మన్ గా కొనసాగారు. టిటిడి ఛైర్మన్ గా ఉన్న సమయంలో పార్టీలోని నేతలకే శ్రీవారి సేవా టిక్కెట్లను ఇవ్వలేదన్న విమర్సలు ఎదుర్కొన్నారు చదలవాడ. టిటిడి ఛైర్మన్ పదవీ కాలం ముగిసింది. పార్టీలో ఎలాంటి పదవులు లేవు. అధినేత చంద్రబాబును కలిసిన చదలవాడక్రిష్ణమూర్తి రాజ్యసభ కావాలని అడిగారు. అయితే ఎమ్మెల్సీ ఇవ్వడానికి మాత్రమే అధినేత ఒప్పుకున్నారు. దీంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు చదలవాడక్రిష్ణమూర్తి. ఎన్నికలు సమీపిస్తుండడంతో చదలవాడక్రిష్ణమూర్తి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళతారన్న ప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ను కలిశారాయన. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాపు సామాజిక వర్గం కావడంతో పాటు తిరుపతిలో ఎమ్మెల్యే గెలుపు కూడా కాపు సామాజిక వర్గం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి చదలవాడక్రిష్ణమూర్తి లాంటి వ్యక్తిని జనసేనలోకి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్థమైపోయారు. తిరుపతి ఒక్కటే కాకుండా చిత్తూరుజిల్లాలో జనసేనపార్టీని చదలవాడక్రిష్ణమూర్తి పటిష్టం చేయగలరన్న సంకేతాలను ఆ పార్టీ నేతల ద్వారా తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్‌.

చదలవాడక్రిష్ణమూర్తి పవన్ కళ్యాణ్‌ ను కలవడంతో ఒక్కసారిగా తిరుపతి రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీనియర్ పార్టీ నేతలుగా ఉన్న కొంతమంది పార్టీలు మారుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. జనసేనపార్టీలో చదలవాడ చేరికతో ఆ పార్టీ నాయకుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానంలో జరిగే ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Total Views: 252 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే