అక్కడ టీడీపీ గెలుపు కష్టమేనా?

మంత్రి పదవి చేపట్టి ఏడాదిన్నర కావస్తున్న తనకంటూ సొంత ముద్ర వేసుకోలేకపోయారాయన. జిల్లాలో ముచ్చటగా ముగ్గురు పార్టీ ఎం ఎల్ ఎ ల మద్దతును కూడగట్టుకోలేకపోయారు. శాఖాపరంగా జరుగుతున్న అక్రమాలసైతం అడ్డుకోలేకపోతున్నారనే అపప్రద మూటగట్టుకున్న ఆ మంత్రి, తన సొంత పట్టణానికి కూడా చేసిందనే విమర్శల పాలవుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి….?

విజయనగరం జిల్లా బొబ్బిలి రాజకుటుంబానికి చెందిన సుజయ్ క్రుష్ణ రంగారావు 2014 ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా బొబ్బిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తరువాత పార్టీలో జరిగిన రాజకీయ పరిణామాలతో వైసిపి ని వీడి టిడిపి లో చేరిపోయారు. అటుపై జరిగిన మంత్రి వర్గ విస్తరణలో అప్పటి వరకు మంత్రి గా ఉన్న కిమిడి మ్రుణాళినికి ఉద్వాసన పలికి , సుజయ్ క్రుష్ణ రంగారావుకు సిఎం చంద్రబాబునాయుడు భూగర్భ గనుల శాఖామంత్రి పదవిని ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సుజయ్ క్రుష్ణ రంగారావు విజయనగరం జిల్లా అధికారుల సమీక్షలతోనే ఎక్కువ కాలం గడిపారు. అదే సమయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించి తానే స్వయంగా ప్రజల సమస్యలను పరిష్కరించే క్రుషి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలకు చెక్ పెడుతూ వారానికి ఓ సారి విజయనగరం పట్టణంలోని తన కార్యాలయంలో అందుబాటులో ఉంటూ వచ్చారు. అయితే జిల్లాలో జరుగుతున్న మైనింగ్ అక్రమాలతో పాటు, రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ దందా విషయంలో సున్నితంగా వ్యవహరించారన్న విమర్శలకు తావిచ్చారు. దీంతో పాటు జిల్లా వైసిపి నేతలు మంత్రినే టార్గెట్ చేస్తూ, మంత్రికి చెందిన భూ వ్యవహారాలపై విమర్శలు గుప్పించారు. ఇదంతా ఒక ఎత్తైతే పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో మంత్రి విఫలమయ్యారనే రాజకీయ విశ్లేషకులంటున్నారు. జిల్లాకు చెందిన ఎం ఎల్ ఎ లను కలుపుకుపోవడంతో మంత్రి సుజయ్ విఫలమవ్వడంతో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లా రాజకీయాల్లో తన కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో జిల్లా ఎం ఎల్ ఎ లకు మంత్రి సుజయ్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇక ఆయన సొంత పట్టణమైన బొబ్బిలి లో సైతం మంత్రికి వర్గపోరు తప్పడం లేదు. తెర్లాం నియోజక వర్గ నాయకుడు తెంటు లక్ష్మునాయుడు మంత్రి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారు. వీటన్నింటి ప్రభావంతో రానున్న ఎన్నికలలో సుజయ్ గట్టెక్కడం గతమంత సులభం కాదనే మాట జిల్లాలో వినిపిస్తోంది.

Total Views: 111 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే