నాగం జనార్దన్‌రెడ్డి దారేటు?

నాగం జనార్దన్‌రెడ్డి… తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు. ఉమ్మడి ఏపీలో టీడీపీ తరుపున ఐదుసార్లు మంత్రిగా పని చేసిన నేత. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో సొంతపార్టీ పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేత. ఆ తర్వాత నాగర్‌కర్నూలు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండిపెండెండ్‌గా నెగ్గి, తెలంగాణ వాణి వినించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీజేపీలో చేరిన నాగం, ఇప్పుడు కమలదళంలో ఎలా ఉన్నారు.ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారా ?ఆయన బీజేపీలోకి ఎందుకు వచ్చానా అని భావిస్తున్నారా..? ఇంతకు ఆయన బీజేపీలో ఉంటారా లేక బయటకు వె ళ్తారా ?నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని 30 ఏళ్ళపాటు ఏక చత్రాదిపత్యతంగా ఆయన ఏళారు. కానీ ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులు తారుమారు అవుతున్న కారణంగా. నాగం అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అంత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

తెలంగాణ సర్కార్  వైఫల్యాలను ఎండగట్టెందుకు కేసీఆర్ సర్కార్‌పై కలబడి పోరు చేయాలన్నా ఉత్సుకతతో నాగం ఉన్నారు. కానీ తెలంగాణ భాజపాలో ఆ పరిస్థితి లేదు. దీంతో మూడున్నర ఎళ్ళుగా సంతప్తికర రాజకీయ వ్యవహారం కొనసాగించలేదు. తెలంగాణ భాజపా నేతలు మాత్రం టీఆర్‌ఎస్ సర్కార్‌కు పెద్దగా పోరాటం చేయకున్న స్నేహసంబంధం చేసే అవకాశం ఉంది. దీంతో ఆ వ్యవహరం నాగంకు నచ్చడం లేదనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. 

తెలంగాణలో బలమైన సామాజికి వర్గానికి చెందిన నాగం జనార్దన్‌రెడ్డికి మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. కాస్త అవకాశం వస్తే దూసుకుపోయే తత్వం కల్గివున్న నాగం పట్ల బీజేపీ నాయకత్వ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోందని కమలనాథులే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అని పోరాడేందుకు నాగం సిద్ధంగా ఉన్నా… బీజేపీ నాయకత్వం ఏమాత్రం సహకరించడంలేదన్న వాదనలు ఉన్నాయి. తెలంగాణ జలహారం, మిషన్‌ కాకతీయ, నాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి వంటి అంశాల్లో అవినీతి గురించిన నాగం మాట్లాడుతుంటే…. బీజేపీ నేతలు ఇందుకు భిన్నంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురయ్యారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యక్తిగతంగానే హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని నాగం సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. చాలా విషయాల్లో నాగంను నైతికంగా దెబ్బతీసే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తుండటంతోబాధపడుతున్నారు. కొందరు బీజేపీ నేతలు తాను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం చేస్తుండటంపై నాగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బీజేపీలో నాగం ప్రయాణం అసంతృప్తితోనే సాగుతోంది. ఇదే కొనసాగితే తెలంగాణ కమలనాథులతో తాడో పేడో తేల్చుకునేందుకు కూడా నాగం సిద్ధంగా ఉన్నారని ఈయన సన్నిహితులు చెబుతున్నారు. 

నాగం బీజేపీను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ప్రచారం గతంలో భాగానే సాగింది. అయితే కాంగ్రెస్ వైపు నాగం ఇప్పటి వరకు అడుగులు వేయలేదు. తాజాగా కీలకమైన వ్యవహారం వెలుగులోకి వ చ్చింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్‌తో నాగం భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కీలకమైన చర్చలు జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న ఎన్నికల లోపు జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోదండరామ్ పార్టీలో నాగం కలిసి పనిచేస్తారన్న ఊహగానాలు వినబడుతున్నాయి. కోదండరామ్ సమావేశంలో అన్ని విషయాలు చర్చించినట్లు తెలుస్తుంది. జేఏసీ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన నాగం కాంగ్రెస్‌లో కాకుండా జేఏసీ పార్టీ నుంచే ఎన్నికల భరిలో ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది.

Total Views: 993 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే