కేటీఆర్ దూకుడుని ఆపగలరా?

ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్…మహా కూటమి మధ్య మాటల యుద్దం తార స్థాయికి చేరుకుంది. టిఆర్ఎస్ ను టార్గెట్ ను చేస్తూ మహా కూటమి విమర్శలు చేస్తుండగా… ఆ పార్టీల కలయిక పై మంత్రి కెటిఆర్ తనదైన విమర్శలు చేస్తు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు తన భుజాల పై వేసుకోని కెటిఆర్ చేస్తున్న ప్రచారం సాగిస్తూ కెటిఆర్ మరింత దూకుడు పెంచారు.

మంత్రి కెటిఆర్ చేస్తున్న ఆరోపణలకు ప్రతిపక్షాలు కూడ సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు తయారయ్యాయని చెప్పవచ్చు. ఆశీర్వాద సభల్లో అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహిస్తూనే…సిరిసిల్లలో నియోజక వర్గంలో ప్రచారం చేస్తున్నారు. సిరిసిల్ల నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కెటిఆర్ నియోజక వర్గంలో పల్లె పల్లెన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాను చేసిన అభివృద్దిని చూసి ఓటెయ్యండంటు ప్రచారం నిర్వహిస్తూ ప్రసంగాలతో ఆకర్షిస్తున్నారు. రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లయేనని కెటిఆర్ ప్రకటిస్తూ ఓటు బ్యాంకును పెంచుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణా వాదాన్ని బలంగా వినిపించిన కేసీఆర్… ఇప్పుడు మాత్రం అభివృద్ది మంత్రం జపిస్తున్నారు. సిరిసిల్ల అభివృద్దికి 400 కోట్ల పై గా నిధులను కేటాయించి రాష్ట్రంలోనే సిరిసిల్లకు అతి ఎక్కువ నిధులు వెచ్చించారు. రవాణా మార్గలే కాకుండా…

ఉరిశాలగా పేరుగాంచిన సిరిశాల పేరెత్తగానే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచే చేనేత కార్మికులు…వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చి ఉపాధి మార్గాలు పెంచడంలో కెటిఆర్ సక్సెస్ అయ్యారనడంలో అతిశయోక్తి లేదేమో. ఉపాధి అవకాశాలు మెరుగు కావడంతో సిరిసిల్ల సిరిగల్ల ఖిల్లాగా సార్థకత సాధించుకున్నట్లయిందంటూ నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి మార్గలు లభించడంతో చేతి నిండా పని దొరకుతున్నదని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సిరిసిల్ల జరుగుతున్న అభివృద్ది కలిసి వస్తుందని…టిఆర్ఎస్ పార్టీ నేతలే కాదు…విపక్ష పార్టీలు సైతం లో లోపాల అంగీకరిస్తున్న పరిస్థితి. తాను చేసిన అభివృద్ది చూసి ఓటెయ్యండి అంటూ అంతే కాని ప్రలోభాలకు లోంగవద్దంటూ కెటిఆర్ ప్రచారంలో చెప్తుడడంతో ఓటర్లను సైతం ఆలోచనలో పడేస్తున్నాయి.

చేనేత కార్మికులకు ఉపాధి మార్గలు పెరగడంతో సిరిసిల్ల కార్మికులంతా కెటిఆర్ నాయకత్వన్ని బలపరుస్తున్నారు. ఇటివల సిరిసిల్ల లో నేతన్నలంత కలిసి చేనేత ఆత్మీయ సభకు కెటిఆర్ ను ఆహ్వనించి ఘనంగా సన్మానించి..కెటిఆర్ నాయకత్వన్ని బలపరుస్తున్నాట్లు ఏక గ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో కెటిఆర్ నేతన్నల జీవితాలను మరింత మెరుగు పడేలా అవకాశాలను మెరుగు పరుస్తానంటు హమీనివ్వడంతో నేతన్నలంతా ఆనందం వ్యక్తం చేశారు. నేత కార్మికులు కాదు…ఇక నుంచి నేత కళాకారులు అంటు కెటిఆర్ సంబోదించడం పట్ల నేతన్నలకు మరింత చేరువయ్యారు.

సిరిసిల్ల ను అభివృద్ది వైపు పరుగులు పెట్టిస్తున్న కెటిఆర్…అదే స్థాయిలో ప్రతి పక్షాల పై మాటల తూటాలు పేలుస్తు…టిఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు.టిర్ఎస్ గట్టున ఉండాలంటు కెటిఆర్ చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటుంది.

Total Views: 392 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ