మంత్రివర్గ విస్తరణ వెనుక భారీ వ్యూహం!

కేబినెట్‌లోకి ఫరూక్‌, శ్రావణ్‌
కొందరి శాఖల్లో స్వల్ప మార్పులు
మండలి చైర్మన్‌ పదవి బీసీలకే?
మండలి చైర్మన్ గా రెడ్డి సుబ్రమణ్యంకు అవకాశం
షరీఫ్ కు డిప్యూటీ చైర్మన్,
విప్‌గా చాంద్‌బాషా

ఏపి ప్రభుత్వం మరోసారి మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది. ఈ సారి మంత్రి వర్గంలోకి ఇద్దరు కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. ముస్లిం మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖ కు ఈ సారి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొందరు మంత్రుల నుండి కొన్ని శాఖలను తొలగించి వేరే మంత్రులకు అప్పగించనున్నారు. మంత్రివర్గ విస్తరణ రేపు ఉదయం లాంచనంగా నిర్వహించటానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్‌లోకి ముస్లిం, ఎస్టీ వర్గాలకు చెందిన ఇద్దరిని కొత్తగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ను, మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. రేపు ఉదయం 11 గంటల 45 నిమిషాల కు మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. ఉండవల్లిలోని ప్రజావేదికలో కొత్త మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు సమయం, వేదికలను గవర్నర్‌కు ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా తెలియజేసింది. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు రాజీనామాలతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను మైనారిటీ, ఎస్టీ సభ్యులతో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి గతంలోనే నిర్ణయించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పుడు జరగబోతున్న మంత్రివర్గ విస్తరణ కీలకం కానుంది.

ముస్లిం వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు టీడీపీలో ప్రస్తుతం నలుగురున్నారు. ఇందులో ఫరూక్‌ శాసనమండలి చైర్మన్‌ కాగా.. ఎమ్మెల్సీ షరీఫ్‌ విప్‌గా, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా.. అత్తార్ చాంద్‌బాషా కదిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కేంద్రంతో విభేధాలు, గవర్నర్‌తో సంభందాలు అంతంతమాత్రంగా ఉన్నందున వైసీపీ నుంచి వచ్చిన జలీల్ ఖాన్‌, చాంద్ బాషాలను ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోరాదని భావించారు. దీంతో ఫరూక్‌, షరీఫ్‌ మాత్రమే మిగిలారు. రాయలసీమలో మైనారిటీలు ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతానికే మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఫరూక్‌తో మండలి చైర్మన్‌ పదవికి రాజీనామా చేయించి మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానాన్ని బీసీలకు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే ప్రస్తుత డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యానికి ఈ పదవి దక్కుతుందని తెలుస్తుంది. అప్పుడు ఎమ్మెల్సీ షరీ్‌ఫను డిప్యూటీ చైర్మన్‌గా నియమించే చాన్స్ ఉంది. కిడారి నిర్వహించిన విప్‌ పదవిని ఎమ్మెల్యే చాంద్‌బాషాకు కేటాయిస్తారని అంటున్నారు. అలా అయితే నలుగురు ముస్లిం ప్రజాప్రతినిధులకు పదవులు లభించినట్లవుతుంది.

ఇక ఎస్టీ వర్గానికి చెందిన వారిలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావు, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. వీరిలో గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి వైసీపీ నుంచి వచ్చారు. గతంలో కిడారికి గానీ, ఈశ్వరికి గానీ కేబినెట్‌లో అవకాశం కల్పిస్తారని భావించారు. ఈలోపు మావోయిస్టులు కిడారిని హత్యచేశారు. దీంతో ఇప్పుడు ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మంత్రి అయిన ఆరునెలల్లోపు ఎమ్మెల్యేగా గానీ, ఎమ్మెల్సీగా గానీ ఎన్నిక కావలసి ఉంటుంది. అయితే ఈలోపే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఫిబ్రవరి చివరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముంది. మార్చి-ఏప్రిల్‌లో ఎన్నికలు జరగొచ్చు. అంటే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ ఆరునెలల గడువు ఇంకా ఉంటుంది. దీంతో శ్రావణ్‌ను నేరుగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దింపుతామని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

నూతనంగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే వారికి ఆయా వర్గాల సంక్షేమానికి చెందిన శాఖలనే కేటాయిస్తారని అంటున్నారు. ఫరూక్‌కు మైనారిటీ సంక్షేమం, శ్రావణ్‌కు గిరిజన సంక్షేమ శాఖలను ఇస్తారు. కొందరు మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో రాష్ట్రంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ ఎవరికిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Total Views: 145 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే