‘సవ్యసాచి’ సింపుల్ రివ్యూ

నాగ చైతన్య ,నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈచిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది . మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం …

విక్రమ్ పాత్రలో నాగ చైతన్య అందరి మన్నలు పొందాడు. ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధిని కలిగి ఉన్న వ్యక్తిగా చైతు ఆకట్టుకున్నాడు. ఇక మరోవైపు విక్రమ్ మేనకోడలు ని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ మిస్టరీ వెనుక అరుణ్ పాత్రలో మాధవన్ వున్నాడని తెలుసుకుంటాడు. ఇంతకీ అరుణ్ ఎవరు ? ఎందుకు మేనకోడలు నిని కిడ్నాప్ చేస్తారు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

ఇక నటన విషయానికి వస్తే విక్రమ్ పాత్రలో నాగ చైతన్య ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. ప్రతినాయకుడి పాత్రలో మాధవన్ అలరించాడు . హీరయిన్ నిధి అగర్వాల్ గ్లామర్ గా కనిపించింది కానీ నటన పరంగా ఆమె చాలా ఇంప్రూవ్ కావాల్సి వుంది.

ఇక వెన్నెల కిశోర్ , సత్య ఉన్నతంలో బాగానే నవ్వించారు. రెండు సాంగ్స్ బాగున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి .డిఫ్రెంట్ కథను ఎంచుకున్న దర్శకుడు చందూ మొండేటి అంతే ఆసక్తిగా కథనాన్ని నడింపించలేకపోయారు.

రొటీన్ రివెంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ ‘సవ్యసాచి’ చిత్రం పర్వాలేదనిపించింది. ట్విన్ సిండ్రోమ్ అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ ని దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేక పోవడంతో ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రాన్ని ఒక సారి చూడొచ్చు.

చివరిగా మేమిచ్చే రేటింగ్ 3.0

Total Views: 2268 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు