సినిమాలకు సమంత గుడ్‌ బై!

వరుస సూపర్ హిట్స్ తో మంచి క్రేజ్ లో ఉన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వ‌చ్చే ఏడాది స‌మంత సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నుందంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్ని 2019 మార్చి వ‌ర‌కు పూర్తి చేసి ఆ త‌ర్వాత ఇంటికే పరిమితం అవ్వాల‌ని సామ్ భావిస్తుంద‌ట‌. అయితే కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ప్ర‌క‌టించిన ఆమె రానున్న రోజుల‌లో సినిమాల‌కి నిజంగానే గుడ్ బై చెబుతుందా అని హాట్ హాట్ చర్చ‌లు జ‌రుపుతున్నారు అభిమానులు. పిల్ల‌ల కోస‌మే స‌మంత ఈ నిర్ణ‌యం తీసుకుందా అంటే.. అప్ప‌ట్లో తాము పిల్లల్ని గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు అని చెప్పింది . పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నాం. ఆ సమయం వచ్చేదాకా కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నాం అని సామ్‌ తెలిపింది. మ‌రి ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఈ ప్ర‌చారంపై స‌మంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

Total Views: 1339 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు