జవాన్‌ మూవీ రివ్యూ

కెరీర్ మొదట్లో వరుస విజయాలను అందుకున్న సాయి ధరమ్ తేజ్ గత కొంత కాలంగా ఏ మాత్రం హిట్స్ అందుకోవడం లేదు. గత సినిమాలు తిక్క – విన్నర్ తో భారీ అపజయాలను అందుకున్నాడు. ఇక స్పెషల్ రోల్ చేసిన నక్షత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ సారి ఎలాగైనా ప్రేక్షకులను మెప్పించాలని జవాన్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి జవాన్ గా సాయి ధరమ్ తేజ్ సక్సెస్ సాధించాడా..? బీవీయస్ రవి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నాడా..,? అన్నదానిపై ఓ లుక్కేద్దాం..

కథ:
చిన్నప్పటినుంచి దేశ భక్తితో పెరిగిన యువకుడు జై (సాయి ధరం తేజ్). తండ్రి టీచర్ అవ్వడంతో.. జై లో దేశ భక్తి పెరుగుతుంది. నరనరానా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా అనే సంకల్పం ఉన్నవాడు. డిఆర్డిఓ లో ఎలాగైనా సైంటిస్ట్ గా జాబ్ సంపాదించాలి అనే గోల్ తో హ్యాపీ గా ఫ్యామిలీ తో కలిసి లైఫ్ ని గడుపుతూ ఉంటాడు. అదే టైం కి భారత దేశాన్ని కాపాడడానికి ఉపయోగించే ఒక మిసైల్ ని తయారు చేస్తారు డిఆర్డిఓ సైంటిస్ట్ లు. ఆ మిసైల్ ని ఉగ్రవాదులకి అప్పగించే డీల్ ని ఒప్పుకుంటాడు కేశవ్ (ప్రసన్న). కేశవ్ ఆ మిసైల్ ని కొట్టేసే ప్రాసెస్ లో అనుకోకుండా జై…. కేశవ్ వేసిన ప్లాన్ కి అడ్డు పడతాడు. ఈ స్పెషల్ స్టాంప్ కోసం విలన్ టీం జై బాబాయి ని చంపుతుంది. ఇది తెలిసిన జై…. విలన్ ప్లాన్ ని ఛేదించి క్షిపణి ని కాపాడతాడు. దానితో, విలన్ జయ్ ద్వారా నే ఆక్టోపస్ ని సంపాదించాలని వాళ్ళ ఫ్యామిలీ లో కి ఎంటర్ అవుతాడు. కేశవ్ యొక్క ప్లాన్ ని గ్రహించిన జై, వాళ్ళ ఫ్యామిలీ ని, ఆక్టోపస్ ని విలన్ భారి నుండి ఎలా కాపాడాడు? కేశవ్ ఆక్టోపస్ ఎలాంటి కుట్రలు పన్నాడు? అసలు ఆక్టోపస్ వలన జై ఫ్యామిలీ పడిన కష్టాలేమిటి? అనేది వెండితెర మీద ‘జవాన్’ సినిమాని కన్నులారా వీక్షించాల్సిందే.

విశ్లేషణ :
సాయి ధరమ్ తేజ్ తన గత చిత్రాలతో పోలిస్తే జవాన్ లో కొత్త లుక్ లో.. కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన మార్క్ ఎనర్జీని పక్కన పెట్టి సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో సినిమా అంతా తన భుజస్కందాల మీదే నడిపించాడు. దేశాన్ని కాపాడాలా..? తన కుటుంబాన్ని కాపాడుకోవాలా ..? అన్న సంఘర్షణను హావభావాల్లో చాలా బాగా చూపించాడు. విలన్ గా ప్రసన్న సూపర్బ్ అనిపించాడు. ధృవ సినిమాలో అరవింద్ స్వామి తరహా స్టైలిష్ విలన్ పాత్రలో ప్రసన్న పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఈ సినిమా తరువాత ప్రసన్న తెలుగులోనూ బిజీ ఆర్టిస్ట్ అయ్యే అవకాశం ఉంది. (సాక్షి రివ్యూస్)హీరోయిన్ పాత్ర కేవలం పాటలకే పరిమితమైంది. హీరో తండ్రి పాత్రలో జయప్రకాష్ మరోసారి తన మార్క్ చూపించారు. సినిమా అంతా హీరో, విలన్ ల మధ్య జరిగే మైండ్ గేమ్ కావటంతో ఇతర పాత్రకు పర్ఫామ్ చేసేందుకు పెద్దగా స్కోప్ లేదు.

తమన్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా….. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. కాకపోతే సాయి ధరం తేజ్ కి హిట్ సాంగ్స్ ని అందించిన తమన్ ఈ ‘జవాన్’ సినిమాతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయాడు. కెమెరా వర్క్ ని అందించిన కె.వి. గుహన్ తన వర్క్ తో ఓ.. అన్నంత ఆకట్టుకోలేకపోయినా పర్వాలేదనిపించారు. అక్కడక్కడా కొన్ని షాట్స్ లో కెమెరా గొప్పదనం కనిపిస్తుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ చాలా వీక్. ఎడిటింగ్ లో ఇంకా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఇక దర్శకుడు కొన్ని సీన్స్ లో ట్విస్ట్ లు యాడ్ చేసి ఉంటె బావుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తక్కువ కాకుండా జాగ్రత్త పడ్డారు.

రేటింగ్: 3.0 /5

Total Views: 1380 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు