పది రోజుల్లో పెళ్లి..అంతలోనే…

కొద్ది రోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన ఓ యువతి అనంత లోకాలకి వెళ్లిపోయింది. టిప్పర్ ఆమెను మృత్యుఒడికి తీసుకెళ్లింది. పది రోజుల్లో పెళ్లి కావాల్సిన ఆమె మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన సరూర్ నగర్ లో చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లాకు చెందిన గీతకు వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో షాపింగ్ కోసమని హైదరాబాద్ నగరానికి వచ్చింది. కాబోయే భర్త శబరి నాథ్ తో కలిసి దిల్ సుఖ్ నగర్ కు వెళ్లింది. అక్కడ షాపింగ్ చేసిన అనంతరం హయత్ నగర్ బంధువుల ఇంటికి వెళ్లడానికి బైక్ పై వెళుతున్నారు. యూ టర్న్ తీసుకొనే సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ వీరి వాహనాన్ని ఢీకొంది. దీనితో బైక్ పై ఉన్న గీత కిందపడిపోయింది. ఆమెపై నుండి టిప్పర్ వెళ్లడంతో రంజిత అక్కడికక్కడే మృతి చెందింది. శబరినాథ్ కు స్వల్పగాయాలయ్యాయి. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన రంజిత మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Total Views: 301 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రక్షించాల్సిన వాడే భక్షించాడు! తిరుపతిలో కామాందుడు!

ప్రభుత్వ బాలికల వసతి గ‌ృహంలో ఓ కామాంధుడి లీలలు బయటపడుతున్నాయి.