మరిన్ని అద్భుత ఆఫర్లుతో జియో!

ఇప్పటికే ఉచిత ఆఫర్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో, మరిన్ని అద్భుత ఆఫర్లు ఇవ్వడానికి సిద్దమవుతుందట. ”త్వరలోనే మేము మా టారిఫ్ ప్యాక్స్ ను అప్ డేట్ చేస్తాం. మరిన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడతాం” అని ముంబాయికి చెందిన ఈ కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. జియో ఇటీవల తీసుకొచ్చిన సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ దెబ్బకొట్టడంతో ఈ ప్రభావం యూజర్ల మీద పడకుండా ఉండేందుకు ఈ ప్లాన్స్ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రైమ్ మెంబర్ షిప్ గడువు 15 రోజుల పొడిగింపుతో పాటు రూ.303 ప్యాక్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలలు ఉచిత సేవలను అందించనున్నట్టు పేర్కొంటూ జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను తీసుకొచ్చింది. కానీ ఆ ఆఫర్ ను వెంటనే విత్ డ్రా చేసుకోమని జియోను ట్రాయ్ ఆదేశించింది.

Total Views: 2512 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

సంచలన నిర్ణయం! మార్కెట్లోకి 200 నోట్లు! ప్రత్యేకతలు ఇవే!

రెండు వందల రూపాయల నోట్ల నమూనాలను విడుదల చేసింది ఆర్బీఐ.