జనసేన కొత్త ‘స్లోగ‌న్‌’ దేనికి సంకేతం!

“అడుగు ముందుకు వేస్తే తల తెగి పడాలే గానీ… కాళ్లు అయితే వెనక్కి పడవు“ అంటూ పిలుపునిచ్చారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఈ స్లోగన్ ప్ర‌స్తుతం అభిమానుల‌తో పాటు కామ‌న్ జ‌నాల్లోనూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ ఒక్క స్లోగ‌న్‌తో రాజ‌కీయ‌ర‌ణ‌రంగంలో అస‌లు సిస‌లు యుద్ధానికి రెడీ అవుతున్నాన‌ని ప‌వ‌న్ హింట్ ఇచ్చాడు. ఇది జ‌న‌సేనాని కొత్త నినాదం. ఈ నినాదంతోనే సేన‌ల్ని సిద్ధం చేస్తున్నాడ‌ని, ప‌.గో జిల్లాలో నేటినుంచి జ‌ర‌గ‌నున్న సేన‌ల శిక్ష‌ణ‌లో ప్ర‌త్యేకించి ఈ నినాదాన్ని ప్ర‌చారం చేయ‌నున్నార‌ని చెబుతున్నారు. బ‌రిలోకి దిగాక స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి పోరాడ‌డ‌మే ధ్యేయంగా ముందుకు క‌ద‌లాల‌న్న‌ది ఈ పిలుపు ఉద్ధేశం. క్యాప్ష‌న్‌లో చిన్న‌పాటి గ్ర‌మ‌టిక‌ల్ మిస్టేక్ ఉన్నా.. అందులోనూ ఏదో ఘాడ‌మైన అర్థం దాగి ఉంద‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే ఎన్నిక‌ల వార్ కోసం అన్ని పార్టీలు సంసిద్ధ‌మ‌వుతున్నాయి. ఎవ‌రికి వారు అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే జ‌న‌సేనాని కూడా స్పీడ్ ఫెంచారు. ఇప్ప‌టికే 4915 మంది జాబితాతో జ‌న‌సైన్యం సిద్ద‌మైంది. ఇందులో రాజ‌కీయ విశ్లేష‌కులు, కంటెంట్ రైట‌ర్లు, స్పీక‌ర్లు ఉన్నారు. ఈ బుధ‌వారం నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు స‌మీపంలోని సీతారామ భారతీయ మండపం వద్ద శిక్షణ కార్య‌క్ర‌మాలు న‌డుస్తున్నాయి.ఆ క్ర‌మంలోనే ప‌వ‌న్ సామాజిక మాధ్య‌మాల్లో కొత్త నినాదం ప్ర‌క‌టించార‌ని భావిస్తున్నారంతా.

Total Views: 1133 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య