రక్షించాల్సిన వాడే భక్షించాడు! తిరుపతిలో కామాందుడు!

ప్రభుత్వ బాలికల వసతి గ‌ృహంలో ఓ కామాంధుడి లీలలు బయటపడుతున్నాయి. అభాగ్యులను కాపాడాల్సిన పెద్దదిక్కే దారుణానికి పాల్పడ్డాడు. దాదాపు పదేళ్లుగా ఎలాంటి బదిలీలు లేకుండా సూపరిటెండెంట్‌గా నందగోపాల్ విధులు నిర్వహిస్తున్నారు. 58 ఏళ్ల వయస్సులో కూడా ఇతను వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఓ మైనర్ బాలికపై అత్యచారానికి పాల్పడ్డాడు. తాను ఇంటికి వెళ్లాలని ఆ బాలిక చెప్పడం…సీడబ్యూసీకి వెళ్లిన తరువాత సరైన మెడికల్ రిపోర్టు లేకపోవడంతో వైద్య చికిత్సలు నిర్వహించారు. ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేలింది. తనకు జరిగిన ఘోరం ఆ బాలిక చెప్పడంతో నందగోపాల్ వ్యవహారం బయటపడింది. అత్యాచారానికి పాల్పడడమే కాకుండా బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని బాలిక పేర్కొంది. ఏడాదిగా ఆ బాలికపై ఇతను అత్యచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి నందగోపాల్‌ను అరెస్టు చేసి కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు. తిరుపతి కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Total Views: 1533 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నటి భానుప్రియపై పోలీసు కేసు

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్