కాంగ్రెస్ లో చేరిన టీఆరఎస్ కీలక నేత!

టీఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. రమేష్ కు వీరంతా పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ టికెట్ ను తాజా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు కేటాయించడంపై రమేష్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో, తన అనుచరులు, మద్దతుదారులతో కలసి రమేష్ కాంగ్రెస్ లో చేరారు. అయితే, ఆయనకు ఖానాపూర్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారా? లేదా? అనే విషయం తెలియరాలేదు. ఆయనకు టికెట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Total Views: 144 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

దమ్ముంటే పంచాయితీ ఎన్నికలకు పెట్టండి : పవన్ సవాల్!

తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ పై జనసేన’ కవాతు ముగిసింది.