రాజ్యసభ సీటు.. వెరీ హాటు!

రాజ్యసభ ఎన్నికలు త్వరలో ప్రారంభం కానుండడంతో ఇప్పటినుండే అధికార, విపక్ష పార్టీలలో వేడి మొదలయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి నెలాఖరున ఎన్నికలు జరగనున్నాయి. అయితే పక్కాగా గెలిచే అవకాశం కనపడుతున్న రెండు స్థానాల కోసం టీడీపీలో గట్టి పోటీ కనిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పుడున్న బలం ప్రకారం ఆ పార్టీకి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే మూడో స్థానానికి కూడా టీడీపీ గురిపెట్టడంతో అందుకు అవసరమైన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గత 14 ఏళ్ల నుంచి టీడీఎల్పీని సమన్వయం చేస్తున్న కోనేరు సురేష్, జూపూడి ప్రభాకర్, ప్రతిభాభారతి వంటి నేతలు ప్రస్తుతం రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారి లిస్టు లో వున్నట్లు తెలుస్తోంది.బీసీ వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు, మాదిగ వర్గానికి చెందిన వర్ల రామయ్య, కమ్మ వర్గానికి చెందిన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, రెడ్డి వర్గానికి చెందిన కర్నూలు జిల్లా నేత కొండారెడ్డి రవీంద్రరెడ్డి పేర్లు ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్నాయి.మరోవైపు నిన్న వైసీపీ తన అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డిని ప్రకటించినందున సీమ నుంచి అదే వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇస్తే బాగుంటుందని పార్టీ వర్గాల ఆలోచన. ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపి లోకి ఆహ్వానించడంలో ముఖ్య భూమిక పోషించిన కర్నూలు జిల్లా నాయకుడు రవీంద్రరెడ్డి పేరు దాదాపు ఖరారు కావచ్చంటున్నారు.

Total Views: 411 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే