‘2.ఓ’ మూవీ రివ్యూ

నాలుగేళ్ల పాటు శ్ర‌మించి, ఏకంగా అయిదు వంద‌ల కోట్ల‌కుపైనే పెట్టుబ‌డి పెట్టి ఓ సినిమా తీశారంటే.. ఆ ప్ర‌య‌త్నానికి, సాహ‌సానికీ వీర‌తాళ్లు వేయాల్సిందే. అది ర‌జ‌నీకాంత్ ‌సినిమా. అందులోనూ సాంకేతికంగా అద్భుతాలు సృష్టించే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కితే… ఇక ఆ సినిమా గురించి చెప్పేదేముంది?ర‌జ‌నీ అభిమానులు ఈ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్ష‌ణ ఫ‌లించింది. 2.ఓ వ‌చ్చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళితే .. నగరంలో హఠాత్తుగా సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఎదురైంది? ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు.దింతో రజనీకాంత్‌ రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి.. మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. మరి చిట్టి ఎలా సమస్య పరిష్కరించింది అనేదే ఈ చిత్రం కథ!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ల చుట్టూనే కథ నడుస్తుంది. ఇందులో సైంటిస్ట్‌ పాత్రలో వసీకరణ్‌గా, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల్లో భిన్నంగా రజనీ చేసిన అద్భుతం అభిమానులకు కన్నులపండువగా ఉంటుంది.

ఇక అక్షయ్‌కుమార్‌ నటన ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తుంది. పక్షిరాజాలా అక్షయ్‌ నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అక్షయ్‌ నటనలోని మరోకోణాన్ని శంకర్‌ అద్భుతంగా ఆవిష్కరించాడు. అమీ జాక్సన్‌ తన పరిధి మేర ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నారు.

శంకర్‌ సినిమా సామాజిక స్పృహ, సందేశాత్మక సినిమాలు చేస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ శంకర్‌ తీసిన సినిమాలను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఈ సినిమాకు కూడా సామాజిక కోణంలోంచే కథను ఎంచుకుని దానికి అధునాతన సాంకేతికతను జోడించిన తీరు అద్భుతం.

విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆస్కార్‌ అవార్డు గ్రహీతలు ఏఆర్‌ రెహమాన్‌, రసూల్‌ పూకుట్టి చేసిన మాయ అందరినీ అబ్బురపరుస్తుంది.స్వర మాంత్రికుడు తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేయగా.. ఇండియన్‌ సినిమాలో 4డీ సౌండ్‌ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి రసూల్‌ తీసుకెళ్లారు. నీరవ్‌ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణ.

Total Views: 4012 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు