సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై స్పందించిన రాహుల్!

రైతుల సమస్యలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, ఇది జాతీయ సమస్య అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని రెండు అత్యంత కీలకమైన సమస్యల్లో ఇది ఒకటని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో మోదీలు రైతులను బరువుగా భావిస్తున్నారని… తాము మాత్రం రైతులను ఆస్తిగా భావిస్తున్నామని తెలిపారు. రైతులను గౌరవంగా చూడాలని చెప్పారు. 15 మంది స్నేహితులకు చెందిన 3.50 లక్షల కోట్ల అప్పును మోదీ తీర్చేశారని… దేశంలోని రైతుల అప్పులను ఎందుకు తీర్చడం లేదని ప్రధానిని తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. తాము రైతులను సంరక్షిస్తామని తెలిపారు. తాజ్ కృష్ణలో జరిగిన మహాకూటమి సమావేశంలో జర్నలిస్టుల ప్రశ్నలకు సామాధానాలిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహాకూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పడం తొందరపాటు అవుతుందని రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన కేసీఆర్ ను ఓడించడమే తమ ప్రథమ లక్ష్యమని చెప్పారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఎవరే విషయంపై చర్చిస్తామని తెలిపారు.

Total Views: 1130 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా