విజయవాడ లో దెయ్యాలు అరెస్ట్!

దెయ్యాలను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసారు. తెల్లటి దుస్తులు ధరించి ఏలూరు రోడ్ లో దెయ్యాలు తిరుగుతున్నాయి అని పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు రెండు దెయ్యాలను అరెస్ట్ చేసారు.. వివరాల్లోకి వెళితే…

విజయవాడ ఏలూరు రోడ్డులో యువకులు హల్‌చల్ చేశారు. హరర్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో దెయ్యాల వేషంలో అర్ధరాత్రి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఇద్దరు వ్యక్తులకు తెల్లటి దుస్తులతో దెయ్యాల వేషాలు వేయించి రోడ్డుపై షూటింగ్ నిర్వహించారు. ఈక్రమంలో ఆ ప్రాంతంలో వెళ్తున్న స్థానికులు వారిని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడకు చేరుకుని షూటింగ్ చేస్తున్న ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారంతా విద్యార్థులని, సరదాగా టెలీఫిల్మ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. కాగా వారిపై కేసు నమోదు చేయాలా వద్దా అనే యోచనలో పోలీసులు ఉన్నారు.

Total Views: 687 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మానవ మృగాలు:ఒకవైపు మామయ్య.. మరోవైపు పిన్ని కొడుకు!

మనుషుల రూపంలో మానవ మృగాలు జనారణ్యంలో తిరుగుతున్నాయి. మంచి తనం