జగన్ పై దాడి కేసు : పోలీసులు సాధించింది ఏంటి ?

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి కేసులో సిట్ దర్యాప్తులో పురోగతి కనిపించట్లేదు. నిందితుడు శ్రీనివాసరావును ఆరు రోజులు విచారించిన పోలీసులు… ఎలాంటి కొత్త కోణాన్ని రాబట్టలేకపోయారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది?. ఎంతమందిపై చార్జిషీట్‌ పెట్టనున్నారు?. శ్రీనివాసరావుకు ఎవరితో ప్రాణహాని ఉందన్న ప్రశ్నలకు ఖాకీల దగ్గర సమాధానం లేకుండా పోయింది.

జగన్‌పై దాడి జరిగిన మరుసటి రోజు నుంచి… ఈ కేసులో ఇప్పటిదాకా 52 మందిని విచారించారు. ఇందులో 19 మంది మహిళలున్నారు. మొత్తం 321 కాల్స్ పరిశీలించిన సిట్‌ అధికారులు… ఆ డేటా ఆధారంగా దర్యాప్తులో ముందుకెళ్లారు. గత ఐదు రోజులుగా కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌ను అన్ని కోణాల్లోనూ ప్రశ్నించారు. కాల్‌డేటాతో పాటు బ్యాంక్‌ అకౌంట్లు ఆధారంగా విచారణ జరిపారు. అటు.. ఎయిర్‌పోర్ట్‌లో సీసీటీవీలను సైతం పరిశీలించారు. అలాగే నిందితుడు శ్రీనివాస్ నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలని భావించినప్పటికీ… కస్టడీ పొడిగించేందుకు కోర్టు నో చెప్పింది.

శ్రీనివాస్‌ విచారణలో ఇప్పటిదాకా ఏం తేల్చారన్న దానిపై డీజీపీ సైతం క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవాలు రాబట్టేందుకు సిట్‌ అధికారులు ప్రయత్నించారని.. ఎయిర్‌పోర్టులో దాడితో జగన్‌కు భద్రతను మరింత పటిష్టం చేశామన్నారు డీజీపీ. మరోవైపు జగన్‌ భుజంపై గాయం మానకపోవడంతో… ఈరోజు నుంచి జరగాల్సిన ప్రజాసంకల్ప యాత్ర వాయిదా పడింది.

Total Views: 41 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ