చంద్రబాబు లక్ష్యంగా మరో మారు పోసాని ఫైర్!

ఏ విషయాన్నీ అయినా ముక్కు సూటిగా మాట్లాడే సినీ దర్శకుడు, యాక్టర్ పోసాని కృష్ణ మురళీ … చంద్రబాబు లక్ష్యంగా మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై సీఎం చంద్రబాబుకు మద్దతిస్తున్నామని తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెళ్లిన నలుగురైదుగురు చెబితే చాలా? అని పోసాని ప్రశ్నించారు. మొత్తం సినీ పరిశ్రమ తరపున చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి వీళ్లెవరంటూ ప్రశ్నించారు.

సినీ ప్రముఖులు అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు, కే ఎల్ నారాయణ, వెంకటేశ్వరరావు, కిరణ్ తదితరులు చంద్రబాబును కలిసి సినీ ఇండస్ట్రీ నుంచి సంపూర్ణ మద్దతు ఉందంటూ ప్రకటన చేశారని, ఈ విషయం ఓ వార్తా పత్రికలో వచ్చిందని అన్నారు. ఒకవేళ ఆ పత్రిక అబద్ధం రాసి ఉంటే ఆ వార్తను వీళ్లు ఖండించాలని, సినీ పరిశ్రమ తరపున కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబును కలిసి తమ మద్దతు ప్రకటించామని చెప్పాలని అన్నారు.‘సినీ పరిశ్రమ మొత్తం చంద్రబాబు హోదా ఉద్యమానికి మద్దతుగా ఉంటుందని వారు చెప్పారు. కానీ నేను మాత్రం మద్దతు ఇవ్వడం లేదు. మమ్మల్ని అడగకుండా మొత్తం సినీ పరిశ్రమ తరపున ఎలా మద్దతు ఇస్తారు? ఇండస్ట్రీ అంటే ఆ ఐదుగురేనా?’ అని ప్రశ్నించారు.

Total Views: 65 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా