రాజేష్‌ని కాపాడుతున్న హాస్పిటల్ బిల్!

క్రైం స్టోరీని తలపించే సుధాకర్ రెడ్డి హత్యోదంతం.. బెడ్‌పైన ఉన్న రాజేష్‌ని అరెస్ట్ చేద్దామంటే పోలీసులకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ‘ఎవడు’ సినిమా స్టోరీని తలపించేలా ఉన్న స్వాతి, రాజేష్‌ల కథ ఆసుపత్రిలో నానుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది కొడుకు సుధాకరే అనుకుని తల్లిదండ్రులు బిల్లు కడుతున్నారు గత నాలుగు రోజులుగా. అయితే స్వాతి, రాజేష్‌ల కుట్ర తెలుసుకున్నఇటు సుధాకర్ కుటుంబం, అటు స్వాతి కుటుంబం.. ఆమెని అసహ్యించుకోవడమే కాకుండా.. బిల్లు కట్టేది లేదంటూ చేతులెత్తేశారు. రాజేష్‌ని అరెస్ట్ చేయాలంటే ముందు డిశ్చార్జ్ చేయాలి. దానికంటే ముందు పెండింగ్ బిల్లు కట్టాలి. సుమారు రూ.2 లక్షల దాకా వుందని వైద్యులు బిల్లుని పోలీసుల ముందు పెట్టారు. రాజేష్‌ని డిశ్చార్జ్ చేస్తే తమ పైసలు రావన్నది వైద్యుల వాదన. దీంతో ఎటూ పాలుపోక నాగర్ కర్నూల్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 

Total Views: 822 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

శ్రీదేవి గుండెపోటుతో చనిపోలేదు! : ఫోరెన్సిక్‌ రిపోర్ట్

 ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై ఫోరెన్సిక్‌ నివేదిక అందింది.