రక్షకులే భక్షకులైతే : 16 మంది మహిళలపై అత్యాచారం

rapeప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే… వారిపాలిట శత్రువుల్లా తయారయ్యారు… ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో 16 మంది గిరిజన మహిళలపై పోలీసులు అత్యాచారానికి పాల్పడినట్టు నేషనల్‌ హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌ పేర్కొంది… ఈఘటనకు సంబంధించిన నివేదికను ఎన్‌హెచ్‌ఆర్సీ వెల్లడించింది. దీంతో పాటు భద్రతా సిబ్బంది వేధింపులు ఎదుర్కొన్న మరో 20 మంది గిరిజనుల స్టేట్‌మెంట్‌ను కమిషన్ రికార్డు చేసింది.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పెద్దపల్లి, చిన్నగెలూర్, పెద్దగెలూర్, గుండం, బూర్గిచెరు గ్రామాల్లోని మహిళలపై 2015 నవంబర్‌ నెలలో భద్రతా సిబ్బంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పేర్కొంది ఎన్‌హెచ్‌ఆర్సీ… మీడియా వార్తల ఆధారంగా విచారణ చేపట్టిన నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌… విచారణ జరపాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసును పంపింది ఎన్‌హెచ్‌ఆర్సీ. లైంగిక ఆరోపణలు, అత్యాచారం, వేధింపులకు సంబంధించి మొత్తం 34 ఎఫ్‌ఐఆర్‌లను కమిషన్ గుర్తించింది. 15 మంది బాధిత మహిళల రికార్డును నమోదు చేసి పంపాల్సిందిగా దర్యాప్తు అధికారి డీఐజీని ఆదేశించింది ఎన్‌హెచ్‌ఆర్సీ.

Total Views: 585 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నారాయణరెడ్డిని హత్య చేయడానికి కారణం ఇదే!

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ నారాయణ