‘మసాజ్’ ముసుగులో ఏం జరుగుతుంది?

ఉద్యోగాల పేరుతో కొంత మంది యువతులను ధాయిలాండ్‌తో పాటు మన దేశంలోని వివిధ స్టేట్ల నుంచి తీసుకుని వచ్చి వారితో స్పా సెంటర్‌లలో మసాజ్‌లు చేయిస్తున్నారు. అయితే దీని పై పక్కా సమాచారం రావడంతో సైబరాబాద్ పోలీసులు ఏకకాలంలో సెంటర్‌లపై దాడులు చేసి మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో మొత్తం 39 మంది యువతులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అందులో చాలా మంది ధాయిలాండ్ దేశానికి చెందిన వారని గుర్తించారు.

వీరందరిని కోర్టులో హజరు పరిచిన పోలీసులు నిర్వహకులను రిమాండ్‌కు పంపగా..యువతులను మాత్రం స్వధార్ హోంకి తరలించారు. అయితే ఇందులో చాలా మంది ఉద్యోగాల పేరుతో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వీరందరిని తమ తమ దేశాలకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా వారి పాస్‌ పోట్‌లను సేకరిస్తున్నారు. డిల్లీలోని ధాయిలాండ్ ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే వారి దేశానికి తిరిగి పంపేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. డిల్లీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే 39 మంది యువతులను తిరిగి కోర్టులో హజరు పరిచి కోర్టు అనుమతితో ధాయిలాండ్ దేశానికి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వారు తిరిగి ఇండియాకు రాకుండా వీరికి వీసా రాకుండ ఉండేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఇలాంటి ఆసాంఘిక కార్యకలాపాల పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పా ముసుగులో మసాజ్ సెంటర్‌లను నడపే వారి పై ఇక పై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు.

Total Views: 1337 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఉలిక్కి పడుతున్న తెలుగు తమ్ముళ్లు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చారని