దర్శకుడు బాబీపై పోలీసు కేసు!

ఆయనో పెద్ద సెలెబ్రెటీ. ఎంతో మంది పెద్ద పెద్ద హీరో లతో కలిసి పనిచేసాడు. స్టేజులు మీద ఊక దంపుడు ఉపన్యాసాలు కూడా చాలానే ఇచ్చారు . సమాజం లో ఆలా ఉండాలి .. ఇలా ఉండాలి అంటూ సినిమాలు తీసాను అని కూడా చెప్పేవాడు . చెప్పటానికే నీతులు అన్నట్టు.. ఈయన గారు మాత్రం ఆ నీతులు ఫాలో అవ్వరు. అర్ధరాత్రి రోడ్ ఆక్సిడెంట్ చేసి కనీసం వారు ఎలా ఉన్నారు .. వారి పరిస్థితి ఏంటో అని కూడా తెలుసుకోకుండా కార్ ఆక్సిడెంట్ చేసి పారిపోయిన  ఘనత ఆయనకే సొంతం.. ఆయనెవరో కాదు దర్శకుడు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘జై లవ కుశ’ చిత్రాల దర్శకుడు బాబీ.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11.30గంటల సమయంలో హర్మీందర్ అనే వ్యక్తి ఓ ఫంక్షన్‌కు హాజరై తిరుగుప్రయాణమయ్యాడు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని వస్తున్న దర్శకుడు బాబీ మితిమీరిన వేగంతో వస్తూ రోడ్డు దాటుతున్న హర్మీందర్ కారును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హర్మీందర్ కారు ఎగిరిపడగా, అందులో ఉన్న అతడి తల్లి రీత్ కౌర్‌కు బలమైన గాయాలయ్యాయి. కారులోంచి దిగిన హర్మీందర్ సింగ్ బాబీని గుర్తించి ఇదేంటని ప్రశ్నించాడు. అయితే అప్పటికే అక్కడికి స్థానికులు చేరుకోవడంతో బాబీ కారుతో పాటు ఉడాయించాడని హర్మీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

Total Views: 1870 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జూనియర్ ఆర్టిస్ట్ రేప్ కేసులో విస్తుపోయే నిజాలు!

హైదరాబాద్ జూనియర్ ఆర్టిస్టు అత్యాచారం వెనుక మరో చీకటి కోణం