భాగ్యనగర వాసులు కల నెరవేరింది

భాగ్యనగర వాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. ఎన్నో ప్రత్యేకతలు కలబోసుకున్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం జాతికి అంకితమిచ్చారు.  మియాపూర్‌-అమీర్‌పేట-నాగోల్‌ మధ్య మెట్రో సర్వీసులకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకూ మెట్రో రైలులో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ ప్రయాణించారు.కాగా ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొద్దిసేపు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో మియాపూర్‌కు బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట బీజేపీ నేతలు లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి ఉన్నారు.

Total Views: 608 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మొహాలీలో రోహిత్ షో

మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు