జగన్ కి జనసేనాని గ్రీన్ సిగ్నల్!

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌ని చేనేత సంఘాల నాయ‌కులు, కార్మికులు క‌లిశారు. హైద‌రాబాద్‌, జూబ్లిహిల్స్‌లోని జ‌న‌సేన కార్యాల‌యానికి చేరుకున్న వారు ప‌వ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌పై వివ‌రించారు. అలాగే ప‌వ‌న్‌కు చేనేత వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు.చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 18 కులాల కార్మికులకు ఉన్న సమస్యలను ప్రభుత్వం తీసుకువెళ్లడానికి తాను ఒక బ్రాండ్ అంబాసిడర్‌గానే కాకుండా జనసేన తరపున కృషి చేస్తానని జనసేన అధినేత పవన్‌కళ్యాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 20న మంగళగిరిలో జరిగే ‘చేనేత సత్యాగ్రహా’నికి వస్తానని ఆయన హామీ ఇచ్చారు.

జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తోందని ఆయన హెచ్చరించారు. ప్యాకేజీని అర్థరాత్రి ఎందుకు ప్రకటించారో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తాను ట్విట్టర్‌లో అయినా మాట్లాడుతున్నానని, కాని ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లడటం లేదని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా కోసం జగన్ తో కలిసి పనిచేస్తారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు పవన్ స్పందించారు. రాష్ట్ర శ్రేయస్సుకోసం ఎవరు ముందుకొచ్చిన స్వాగతిస్తానని చెప్పిన పవన్ .. తనకు వ్యక్తిగతంగా ఎవరు మీద ద్వేషం లేదని జగన్ ని ఉద్దేశించి చెప్పడం విశేషం.

Total Views: 16637 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మరోసారి కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి