పవన్ న్యూఇయర్‌ గిఫ్ట్ ఎలా ఉందంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికే విడుదల అయ్యాయి. కానీ పవన్ పాడిన కొడకా కోటేశ్వరరావు పాట మాత్రం విడుదల చేయలేదు. అయితే న్యూ ఇయర్ జోష్ ను మరింత పెంచేందుకు డిసెంబర్ 31సాయంత్రం 6గంటలకు విడుదల చేయబోతున్నామని తెలిపారు అనుకున్నట్టే ఇవాళ సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విడుదల చేశారు. అయితే ఈ పాట పవన్ కల్యాణ్‌ మేనరిజమ్స్‌తో ఆయనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఉంది. కొడకా.. కోటేశ్వరావు అంటూ సాగే ఈ సాంగ్‌తో ఫ్యాన్స్‌కి పవన్ న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చేశాడు. దీంతో అభిమానులు పండగా చేసుకుంటున్నారు.

కాగా ఈ పాట.. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో
పులస లాగా ఎగిరి పడితే పులుసైపోతావురో
చాచి కొడితే పెనం మీద దోశ ఐపోతావురో…పగిలిన గ్లాస్ ఐపోతావురో… అంటూ పవన్ తన రెగ్యులర్ మేనరిజమ్స్‌తో ఇరగదీసాడు.

కాగా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి వస్తున్నాడు ‘అజ్ఞాతవాసి’ లో కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటించగా తమిళ నటి ఖుష్భూతో పాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది.

Total Views: 379 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జాతీయ అవార్డు విజేతలు వీరే

2017 సంవత్సరానికి గానూ జాతీయ సినిమా అవార్డులను కేంద్రం ప్రకటించింది.