జే.ఎఫ్.సి నివేదికను సిద్ధం..అందులో ఏముంది?

పవన్ కల్యాణ్ నియమించిన జేఎఫ్ సి తన నివేదికను సిద్ధం చేసింది. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మరో రెండు రోజుల్లో పవన్ కల్యాణ్ కు నివేదికను ఇవ్వనుంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. వారం రోజుల్లో ఏపీ, కేంద్రం లెక్కలను జేఎఫ్ సి తేలుస్తుందని పవన్ కల్యాణ్ అప్పుడు ప్రకటించారు. తొలిరోజు మేధావులు, మరుసటి రోజు నిపుణులు జరిపిన చర్చలు ఏమయ్యాయి? ఆ నివేదిక అసలు రూపుదాల్చిందా? ఒక వేళ నివేదిక వచ్చినా ఆలస్యమెందుకు ఇవీ పలువురి వ్యాఖ్యలు. అయితే నివేదిక సిద్ధమైంది. రెండో రోజుల్లో పవన్ కల్యాణ్ కు చేరనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల లెక్కలతో పాటు ఎవరి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రానికి ఈ పరిస్థితి ఏర్పడిందన్నది కూడా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదికలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక హదాకు బదులు ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పుడు ఏపీ సర్కార్ ఎందుకు అంగీకారం తెలపవలసి వచ్చిందో కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. అలాగే కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉపయోగించింది? దానికి కేంద్రం తెలుపుతున్న అభ్యంతరాలను కూడా ఇందులో పొందుపర్చారని జేఎఫ్ సి వర్గాలు వెల్లడించాయి.

Total Views: 138 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బ్రేకింగ్ : టీడీపీ పోటీచేసే అభ్యర్థుల వివరాలు ఇవే!

మహా కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ