పవన్ వ్యూహాత్మక అడుగులు.. నేత‌ల్లో టెన్ష‌న్ టెన్ష‌న్‌!!

pkప్రముఖ సినీ హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ఓటు నమోదుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తన ఓటును నమోదు చేసుకోవాలని పవన్‌ నిర్ణయించారు. ఏలూరుకు చెందిన జనసేన నేతలు హైదరాబాద్‌ లో పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్‌ తన నిర్ణయాన్ని తెలిపారు. కాగా పవన్‌ సొంత జిల్లా పశ్చిమగోదావరి అనే విషయం తెలిసిందే. పవన్‌ కు ప్రస్తుతం హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్ లో కొటెదెల పవన్ కళ్యాణ్ పేరుతో ఓటు హక్కు ఉంది. హైదరాబాద్‌ లోనే ఓటు హక్కు ఇప్పటివరకూ వినియోగించుకున్నారు. కాగా రాష్ట్ర విభజన జరగడం, మారిన రాజకీయ పరిస్థితుల కారణాల వల్ల పవన్‌ ఈ నిర‍్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పోల్చుకుంటే సినిమా పరంగా చూస్తే రెండు రాష్ట్రాలలోనూ భారీ అభిమానులే వున్నారు. కానీ విభజనానంతరం ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని పవన్ తరచూ పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికలలో పవన్ పశ్చిమగోదావరి జిల్లా నుండి పోటీచేయవచ్చనే సంకేతాలు వినవస్తున్నాయి. కాగా జనసేన కార్యాలయానికి తన నివాసానికి రెండింటికీ భవనాలను వెదకాలని పవన్ అభిమానులకు పురమాయించటంతో ఈ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది.

ఈ వార్త ఇప్పుడు ఏలూరు లోక‌ల్ నాయ‌కుల్లో టెన్ష‌న్ పుట్టిస్తోంద‌ని స‌మాచారం. ప‌వ‌న్ అభిమాన బ‌లం ముందు ఎన్ని పార్టీలన్నా చిత్తు కావాల్సిందేన‌ని ఇప్ప‌టికే స‌భ‌ల నిర్వ‌హ‌ణ ద్వారా తెలిపోయింది. పైగా అక్క‌డ భ‌వ‌న నిర్మాణం కూడా ఏర్పాటు చేయడంతో ప‌వ‌న్ పెద్ద ప్లాన్ తోనే రంగంలోకి దిగుతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ కు హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ నియోజ‌క వ‌ర్గంలో ఓటు హ‌క్కు ఉన్న సంగ‌తి తెలిసిందే.

suresh-picసురేష్( కొత్తపేట)

Total Views: 6949 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీకి షాక్ : జ్యోతుల రాజీనామా!

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి షాక్. క్రియాశీలకంగా పనిచేస్తున్న ఏలేరు