అలాంటి పక్షులను నమ్మను : పవన్ కళ్యాణ్

గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు ఏపీలో కీలక మంత్రి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ ఆయన మంత్రే.  ఇప్పుడు టీడీపీలో ఉన్న ఆయన.. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్‌లోకి ప్రజారాజ్యం విలీనం తర్వాత ఆయణ్ను మంత్రి పదవి వరించింది. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయనకు… చంద్రబాబు ప్రభుత్వంలోనూ మంత్రి పదవి వరించింది. చిరంజీవికి సన్నిహితంగా ఉండే.. గంటా జనసేనలో చేరతారని ఆ మధ్య వార్తలొచ్చినా ఆయన తొసిపుచ్చారు. ఇప్పుడు ఇదే విషయమై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. గంటా శ్రీనివాసరావును జనసేన పార్టీలోకి ఆహ్వానించేది లేదని స్పష్టం చేశారు. ఆయన ఆలోచన ధోరణి జనసేనకు సరిపడదని.. గంటా లాంటి వ్యక్తులు పక్షుల్లా వచ్చి ఎగిరిపోతారని.. అలాంటి పక్షులను తాను నమ్మనని పవన్‌ అన్నారు. నిన్న రాత్రి విశాఖ జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో పదునైన వ్యూహంతో ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెడతామన్న ఆయన.. వెన్నుపోటు పొడిపించుకునేంత బలహీనుడిని కాదని చెప్పారు.

Total Views: 78 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే