‘చమన్’ది సహజ మరణం కాదా?

పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ తెలుగు దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.చమన్‌ది సహజ మరణమేనా? కాదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వివరించింది. అదే సమయంలో చమన్‌ చనిపోయిన నాలుగు రోజులకే ఆయన కారు డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా చనిపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు వివరించింది.

పరిటాల కుమార్తె వివాహ వేడుకలో బిజీగా ఉండగా ఆయనకు సడన్ గా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా సరిగ్గా మే 7వ తేదీన మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం చమన్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా చమన్ అనుచరుడు కారు డ్రైవర్ గా పని చేసిన నూర్‌ మహమ్మద్‌ కూడా అనుమాన స్పదంగా మృతి చెందడం అనంతపురంలో కొత్త తరహా వార్తలకు తెరలేపుతోంది.

కారు పంక్చర్ అవ్వడంతో ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోన్న నూర్‌ మహమ్మద్‌ ను అతని సన్నిహితున్ని ఓ కారు డీ కొట్టింది. అందుకు సంబందించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. వారిని డి కొట్టిన కారు ఎవరిది అనేది ఇంతవరకు తెలియరాలేదు. గుర్తు తెలియని వాహనం డి కొట్టిందని పోలీసులు తెలుపుతున్నారు. అయితే నాలుగు రోజుల వ్యవధిలోనే చమన్ మరియు అతని డ్రైవర్ మృతి చెందడం రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అలాగే కొన్ని మీడియాల్లో వస్తోన్న కథనాలు లకూడా అనేక అనుమానాలను రేపుతోంది. చమన్ రాజకీయ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని ఇంతలోపే ఈ ఘటన జరగడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. మరి ఈ విషయంపై తెలుగు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Total Views: 4115 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే