‘పైసా వసూల్’ రివ్యూ & రేటింగ్

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ, తన 101 చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్‌ చెప్పిన కథకు పచ్చజెండా వూపి అందర్నీ ఆశ్చర్యపరిచారు.మిగతా దర్శకుల సినిమాల్లో కథానాయకుడి పాత్రకు, పూరి సినిమాల్లోని పాత్రకు చాలా ‘తేడా’ ఉంటుంది. మాస్‌ను దృష్టిలో పెట్టుకునే పూరి తన కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దుతారు. ఒకరకంగా చెప్పాలంటే ‘చంటిగాడు లోకల్‌’ టైపు. మరి బాలకృష్ణలాంటి అగ్రకథానాయకుడు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తే? అభిమానులకు, ప్రేక్షకులకు అది ‘పైసా వసూల్‌’ లాంటి కిక్‌ నిచ్చిందా? సరికొత్త కాంబినేషన్‌ ఆకట్టుకుందా?

కథ :
తేడాసింగ్‌(బాలకృష్ణ).. తీహార్‌ జైలు నుంచి బయటకు వస్తాడు. దేనికీ భయపడడు. ఎవరినైనా ఎదిరిస్తాడు. మరోపక్క బాబ్‌మార్లే(విక్రమ్‌జీత్‌) అనే ఇంటర్నేషనల్‌ మాఫియాడాన్‌ కోసం భారతదేశ పోలీసులు వెతుకుతుంటారు. అత‌ను పోర్చుగ‌ల్‌లో ఉండి ఇండియాలో విధ్వంసాలు సృష్టిస్తుంటాడు. అతడిని పట్టుకోవాలంటే ఇక్కడి చట్టాలు, ప్రభుత్వాలు అడ్డు వస్తుంటాయి. దీంతో మరో గ్యాంగ్‌స్టర్‌తో అతడిని హతమార్చడమే సరైన మార్గమని భావిస్తాడు ‘రా’ అధికారి(కబీర్‌బేడి). ఇదే సమయంలో తేడాసింగ్‌ వీరికి కనపడతాడు. ఈ తేడాసింగ్‌ను ఉపయోగించుకుని బాబ్‌మార్లేను అంతమొందించడానికి స్కెచ్‌ వేస్తారు. మరి ఆ మాఫియాడాన్‌ను తేడాసింగ్‌ పట్టుకున్నాడా? అతడిని తుదముట్టించాడా? అసలు ఈ తేడాసింగ్‌ ఎవరు? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:
మొదటి నుంచి చిత్రయూనిట్ చెపుతున్నట్టుగా ఇది పూర్తిగా బాలయ్య వన్ మేన్ షో. ఇన్నాళ్లు మాస్, సీరియస్ పాత్రలో చూసిన బాలయ్య, పైసా వసూల్ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. కామెడీ, యాక్షన్ లో అభిమానులతో విజిల్స్ వేయించాడు. పూరి మార్క్ హీరోయిజంలో ఒదిగిపోయిన బాలకృష్ణ, తన స్టైల్ మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. పేరుకు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా.. ఎక్కువగా శ్రియ పాత్రే గుర్తుండిపోతుంది. శ్రియ నటనతో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ముస్కాన్, కైరా దత్ లకు పెద్దగా నటనకు అవకాశం లేదు. విలన్ రోల్ లో విక్రమ్ జీత్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రా ఆఫీసర్ గా కబీర్ బేడి చిన్న పాత్రలో కనిపించినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. సినిమాలో ప్ర‌త్యేకంగా పెద్ద‌గా కామెడీ లేదు. తొలి భాగంలో 30 ఇయర్స్ పృధ్వీ, సెకండ్ హాఫ్ లో ఆలీ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

రా ఏజెంట్‌గా బాల‌కృష్ణ‌ను దర్శ‌కుడు ఎలివేట్ చేసిన తీరు, బాల‌కృష్ణ వ్యావ‌హారిక శైలి చాలా వ‌ర‌కు `పోకిరి` చిత్రాన్ని, పూరి గ‌త చిత్రాల‌ను గుర్తుచేస్తాయి. కెమెరాప‌రంగా, ఎడిటింగ్ ప‌రంగా సినిమా బాగా ఉంది. కానీ మావా ఏక్ పెగ్ లా, ప‌ద మ‌రి, పైసా వ‌సూల్ పాట‌లు బావున్నాయి. రీరికార్డింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఉంటే బావుండేదేమో. మినిస్ట‌ర్‌గా న‌టించిన కృష్ణ‌స్వామి శ్రీకాంత్ ముఖంలో భావోద్వేగాలు స‌రిగా ప‌ల‌క‌లేదు. క‌థలోనూ చెప్పుకోద‌గ్గంత కొత్త‌ద‌నం ఏమీ లేదు. క్లైమాక్స్ లో బాల‌కృష్ణ దేశం గురించి, దేశ‌భ‌క్తి గురించి మాట్లాడిన తీరు మెప్పిస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే మాస్‌ను, బాల‌కృష్ణ అభిమానుల‌ను అల‌రించే పూరి జ‌గ‌న్నాథ్ మార్కు చిత్ర‌మిది.

రేటింగ్ : 2.5

(Satish K.S.R.K)

Total Views: 3836 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ