జాతీయ గీతం ఎలా పుట్టింది? మీలో ఎంతమందికి తెలుసు?

flagజన గణ మన అధినాయక జయహే’ వెనక మనకు గుర్తులేని చరిత్ర ఎంతో ఉంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించేందుకు పార్లమెంట్‌కు ఎంతో కాలం పట్టలేదు. కానీ జాతీయ గీతాన్ని ఎంపిక చేసుకోవడానికే దాదాపు మూడేళ్లు పట్టింది. తొలుత స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించాలనే డిమాండ్ వచ్చింది.

జాతీయ కాంగ్రెస్ ప్రతి సదస్సులో వందేమాతరం గీతాన్నే ఆలాపించేవారు. మొహమ్మద్ జిన్నా లాంటి ముస్లిం నాయకులు, ఆయన అనుచరులు కూడా గౌరవపూర్వకంగా లేచి నిలబడేవారు. ఆ తర్వాత ఛాందసవాద ముస్లిం నాయకులు తమ మత విశ్వాసాలకు ఆ గీతం వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అప్పుడు వారి మనోభావాలను గౌరవించి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ తర్వా 1950, జనవరి 26వ తేదీన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించినప్పుడు పార్లమెంట్‌లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘జన గణ మన అధినాయక జయహే’ను జాతీయ గీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాటలకు సమాన హోదాను కల్పిస్తూ ఒక్కొక్కటి కచ్చితంగా 60 సెకండ్లు ఉండాలని కూడా పార్లమెంట్ నిర్ణయించింది.ఆరోజుల్లో జాతీయ గీతం 60 సెకండ్లు ఉండాలంటే ఎక్కువ, తక్కువ కాకుండా కచ్చితంగా 60 సెకండ్లే ఆలాపించేవారు.

Total Views: 805 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రంజాన్ విశిస్టత మీకు తెలుసా?

‘అల్లాహు అక్బర్ అల్లాహుమ్మ అహిల-హు అలైన బిల్ అమ్ నివల్