నంద్యాల పోరుపై క్లారిటీ ఇచ్చిన పవన్‌

తెలుగుదేశం పార్టీకి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కొంత మేర షాక్ ఇచ్చారనుకోవచ్చా?కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ను పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత మీడియా ఈ ప్రశ్న వేస్తే రెండు రోజులలో తమ నిర్ణయం చెబుతామని అన్నారు. పవన్ కళ్యాణ్ తమతోనే ఉన్నాడని చంద్రబాబు, టిడిపి నేతలు సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నించిన తరుణంలో ఆయన తటస్థ వైఖరిని ప్రదర్శించడం చెప్పుకోదగ్గ పరిణామమే.

క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకె ఎన్నికలలో పోటీచేస్తామని ఆయన అన్నారు.2019 ఎన్నికల వరకు ఎన్నికలకు దూరంగా ఉంటామని ఆయన అన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని పలువురు లేఖలు రాశారని, వారిలో కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి కూడా ఉన్నారని ఆయన చెప్పారు.ఈ ఎన్నికలలో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ప్రజల్లో జనసేనకు మద్దతు ఉన్నప్పటికీ నంద్యాల కేవలం ఉప ఎన్నికే కాబట్టి తాము దానిపై తటస్థంగా ఉండాలని నిర్ణయించామన్నారు. ఏ విషయంపైనైనా తమ పార్టీ నిర్ణయం తీసుకుంటే మీడియాముఖంగా వచ్చి ప్రకటిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా తమకు జనసేన మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటే అది కేవలం అపోహ మాత్రమేనని ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.జనసేన ఇప్పటికే బిజెపికి దూరంగా ఉంటుండగా, తాజాగా టిడిపికి మద్దతు ఇవ్వకుండా, తటస్థంగా ఉంటామని ప్రకటించడం ద్వారా తెలుగుదేవం కు కొంత షాక్ ఇచ్చినట్లే.. అవుకోవచ్చు.నంద్యాల ఉప ఎన్నికలోగాని, కాకినాడ మున్సిపల్ ఎన్నికలలో గాని జనసేన తటస్థ వైఖరి అవలంభిస్తుందని ప్రకటించడం విశేషం.

Total Views: 1039 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నిన్నటి వరకు జ‌బ‌ర్ద‌స్త్‌ జూ. ఆర్టిస్ట్ .. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

నిన్నటి వరకూ జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ ..