వైసీపీలో ఎన్నారైల జోరు!

పార్టీలో ఎన్నారైల జోరు.. జోషుమీద కార్యకర్తలు.. గెలుపు ధీమాపై నేతలు.. ఇది ప్రస్తుత వైసీపీ పరిస్థితి. జగన్ పార్టీలో చేరేందుకు ఎన్నారైలు ఆసక్తికి చూపుతున్నారు. అటు జగన్ కూడా ఎన్నారై లతో పార్టీ గెలుపు ఖాయం అన్నవిధంగానే అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు వారి వారి స్థానాల్లో పార్టీ బాధ్యతలు కూడా అప్పజెబుతున్నారు. పూర్తివివరాల్లోకి వెళితే .. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌ రాజకీయ ముఖచిత్రంలో త‌ళుక్కున మెరిసిన విడ‌ద‌ల ఎన్నారై ర‌జ‌నీ కుమారి. ఆమె మెట్టి నిల్లు చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసి మంత్రి ప్రత్తిపాటిని మ‌ట్టిక‌రిపించాల‌ని డిసైడ్ అయ్యారు . ఈ నేప‌థ్యంలో ఆమె కూడా త‌న‌దైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆమె వైసీపీలో రోజా త‌ర్వాత రెండో లేడీ ఫైర్‌బ్రాండ్‌గా ముద్రప‌డిపోయారు.

చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఆశిస్తున్న ద‌యాసాగ‌ర్ రెడ్డి కూడా ఎన్నారై. ఈయ‌న నార్త్ అమెరికా తెలుగు అసోసియేష‌న్ ప్రధాన కార్యద‌ర్శి హోదాలో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక్లలో ప‌ల‌మ‌నేరు నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న ప్లాన్ చేసుకున్నారు.

ఇక ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నుంచి ఎన్నారై కొఠారు అబ్బయ్య చౌద‌రి వైసీపీలో దూసుకుపోతున్నారు.వైసీపీ యూర‌ప్‌, యూకే క‌న్వీన‌ర్‌గా అక్కడ పార్టీ సిద్ధాంతాలు ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకు అబ్బయ్య చౌద‌రి బాగా శ్రమించారు.టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ను ఓడించేలా అబ్బయ్య చౌద‌రి దూసుకుపోతున్నారు. మొత్తానికి వైసీపీలో ఎన్నారై అభ్యర్థుల హవా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Total Views: 130 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే