‘నిన్ను కోరి’ మూవీ రివ్యూ & రేటింగ్

వ‌రుస విజ‌యాల‌తో కెరీర్‌లో హై మీద ఉన్న నాని మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇన్నాళ్లూ తన శైలి కామెడీతో పాటు విభిన్నమైన ప్రేమకథల మేళవింపుతో సినిమాలను చేస్తూ వచ్చిన నాని, బలమైన భావోద్వేగాలకి కూడా చోటున్న కథని ఎంచుకొని ‘నిన్నుకోరి’ చేశారు. ఆల్రెడీ `జెంటిల్‌మేన్‌`తో హిట్ పెయిర్‌గా నిలిచిన నాని, నివేదా థామ‌స్ మరోసారి జంట‌గా న‌టించిన చిత్రం నిన్నుకోరి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది.. `నిన్ను కోరి` అనే టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?

కథ :
ఉమామ‌హేశ్వ‌ర‌రావు (నాని) స్టాటిస్టిక్స్ మీద ప‌ట్టున్న వ్య‌క్తి. జ‌ర్న‌ల్స్‌లో త‌న స‌బ్జెక్ట్ గురించి చాలా విష‌యాలు రాస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో అత‌ని డ్యాన్సు చూసి ప‌ల్ల‌వి (నివేదా థామ‌స్‌) ఇష్ట‌ప‌డుతుంది. త‌న‌కు కూడా డ్యాన్సులు నేర్ప‌మ‌ని అడుగుతుంది. క్ర‌మంగా వారి ప‌రిచ‌యం చ‌నువుగా మారుతుంది. అది ప్రేమ‌కు దారి తీస్తుంది. వైజాగ్‌లో ప‌ల్ల‌వి ఇంటి డాబా మీద పెంట్ హ‌వుస్‌లోకి చేరుతాడు ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. ప‌ల్ల‌వి తండ్రితో త‌రచూ మాట‌లు క‌లుపుతుంటాడు. ఇంత‌లో ఇంట్లో వారు ప‌ల్ల‌వి పెళ్లి గురించి మాట‌లు లేవ‌నెత్తుతారు. దాంతో భ‌య‌ప‌డ్డ ప‌ల్ల‌వి త‌న‌ని పెళ్లి చేసుకోమ‌ని ఉమా మ‌హేశ్వ‌ర‌రావును కోరుతుంది. కానీ ఆ సంద‌ర్భంలో అత‌ను ప‌ల్ల‌విని ఒప్పించ‌డంలో విఫ‌ల ప్ర‌య‌త్నం చేసి, కెరీర్‌కి ఓటేసి వెళ్లిపోతాడు. ప‌ల్ల‌వికి అరుణ్ (ఆది పినిశెట్టి)తో పెళ్లి జ‌రుగుతుంది. ఫారిన్‌లో సెటిల‌వుతుంది. ఆ త‌ర్వాత ప‌ల్ల‌వి ఇంటికి ఉమా మ‌హేశ్వ‌ర‌రావు వెళ్తాడు. ఎందుకు వెళ్లాడు? ప‌ల్ల‌వికి, ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకి మ‌ధ్య ఏం జ‌రిగింది? అరుణ్‌తో ప‌ల్ల‌వి కాపురం స‌జావుగా సాగిందా? లేదా? అస‌లు ప‌ల్ల‌విని ప్రాణంలా ప్రేమించిన ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఆమెను విడిచిపెట్టి కెరీర్ వైపు మొగ్గు చూప‌డానికి దారితీసిన కార‌ణాలేంటి? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.

విశ్లేష‌ణ‌
నేచురల్ స్టార్ నాని నటుడిగా మరోసారి తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తన స్టైల్ అల్లరి సీన్స్ గిలిగింతలు పెట్టిన నాని, చాలా సీన్స్ లో ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు. విలన్ లేని సినిమాలో అక్కడక్కడే తానే విలన్ బాధ్యత తీసుకొని కథను ముందుకు నడిపించాడు. మరో హీరో ఆది ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తక్కువ మాటలతో సెటిల్ ఫర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఆది నటన సూపర్బ్. హీరోగా నివేదా బెస్ట్ చాయిస్ అనిపించుకుంది. ఇప్పటికే జెంటిల్ మేన్ సినిమాతో నానికి జోడిగా నటించిన నివేదా మరోసారి మంచి కెమిస్ట్రీతో అలరించింది. ఫస్ట్ హాఫ్ లో అల్లరి అమ్మాయిగా కనిపించిన నివేదా, సెకండ్ హాఫ్ లో హుందాగా కనిపించి మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో నివేదా నటన ప్రతీ ఒక్కరి గుండె బరువెక్కిస్తుంది. తండ్రి పాత్రలో మురళి శర్మ మరోసారి ఆకట్టుకోగా, తనికెళ్ల భరణి, పృథ్వి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

నాని.. ఆది.. నివేదా థామస్‌ల పాత్రలే ఈ సినిమాకి కీలకం. ఆ ముగ్గురూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా నివేదా అందం, అభినయంతో ఆకట్టుకుంది. అదే సమయంలో నాని కూడా భావోద్వేగాలు బాగా పండించారు. ఇక ఆది పినిశెట్టి పతాక సన్నివేశాలకు ప్రాణం పోశారు. పృథ్వీ, సుదర్శన్‌, మురళీ శర్మ, విద్యుల్లేఖరామన్‌ వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. గోపీ సుందర్‌ సంగీతం, కార్తీక్‌ ఘట్టమనేని కెమెరా పనితనం బాగా కుదిరింది. దర్శకుడు శివకు ఇది తొలి చిత్రమైనా ఎక్కడా తడబాటు లేకుండా ఎంతో స్పష్టతతో చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కడక్కడ సంభాషణలతోనూ మెరిపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్‌: 2.75

(Satish K.S.R.K)

Total Views: 4089 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కమెడియన్ జోగినాయుడు రెండో వివాహం!

ప్ర‌ముఖ యాంక‌ర్ మాజీ భ‌ర్త‌, టాలీవుడ్ కమెడియన్ జోగి నాయుడు