రాజకీయం అంటే ఇదికాదు బాలయ్య!

బాలయ్య రాజకీయాలు ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అనే సామెతను తలపిస్తున్నాయి. హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు తనను ‘దున్నపోతు’గా మార్చడం పై ఆగ్రహించిన బాలయ్య సొంత పార్టీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇదేనా పార్టీలో నాకిచ్చే గౌరవం అని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా, స్థానిక టీడీపీ నేతలు స్పందించకపోవడంపై మండిపడుతున్నాడు బాలయ్య .’మా ఎమ్మెల్యే కన్పించడంలేదు’ అని ప్రజలు పోలీసులను ఆశ్రయించినప్పుడే పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన అధికార ప్రతినిధులు చొరవ తీసుకుని ఉంటె సమస్య ఇంత దూరం వచ్చేది కాదని బాలకృష్ణ వాదన.

అయితే హిందూపూర్ నియోజక వర్గ తెలుగు దేశం నేతల వాదన మరోలా ఉంది. నియోజక వర్గంలో బాలకృష్ణ మాకు ఏనాడూ విలువిచ్చిందే లేదని వారి ఆవేదన. బయట వ్యక్తులను తీసుకొచ్చి మా నెత్తిన కూర్చోబెడుతున్నాడు తప్పా తమను పిలిచి బాధ్యతలు అప్పగించిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయినా తండ్రి ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడిచి ఉంటె బాలయ్యకు ఈ తలనొప్పి వచ్చేదే కాదు.. ఆ నాడు హిందుపూర్ లో గెలిచినా ఎన్టీఆర్ ఆ నియోజక వర్గం మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టె వారు.. ముఖ్యమంత్రిగా రాజధానిలో ఉన్నా కానీ హిందుపూర్ లో సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని చర్యలు తీసుకునే వారు. ఇప్పటికైనా సినీ హీరో బాలకృష్ణా మాదిరి కాకుండా ఎమ్మెల్యే బాలకృష్ణ లా మెలగాలని కోరుకుందాం!

ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది .. చినబాబు పైన ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం వెంట వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టి పోస్తున్న తెలుగు తముళ్ళకు బాలయ్యను తిడుతున్న తిట్లు కనిపించటం లేదా ? వినిపించం లేదా ? కొంచం ఈ యాంగిల్లో కూడా ఆలోచించు బాలయ్య….

Total Views: 2550 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నిన్నటి వరకు జ‌బ‌ర్ద‌స్త్‌ జూ. ఆర్టిస్ట్ .. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

నిన్నటి వరకూ జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ ..