‘ప్రేమమ్’ మూవీ రివ్యూ

nagలవర్ బాయ్ నాగచైతన్య హీరోగా నటించి రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ప్రేమమ్’ శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో రిలీజైంది. మలయాళంలో హిట్టయిన ప్రేమమ్‌కి ఇది రీమేక్. ఇందులో చైతన్య పక్కన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లు. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ప్రేమమ్.. ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనేది చూడాలంటే రివ్యూలోకి వెళ్దాం.

కథ :
ప్రతీ వ్యక్తి జీవితంలోని మూడు దశల్లో కలిగే ప్రేమ కథలనే ప్రేమమ్లో సినిమాటిక్గా చూపించారు. 15 ఏళ్ల వయసులో పదోతరగతి చదువుతున్న విక్రమ్(నాగచైతన్య), ఆ ఊళ్లో కుర్రాళ్లంతా వెంటపడే అందమైన అమ్మాయి సుమ(అనుపమా పరమేశ్వరన్)ను ఇష్టపడతాడు. ఆ వయసులోనే కవితలతో ప్రేమలేఖలు రాస్తాడు. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అన్నిరకాల కష్టాలు పడతాడు. అంతా ఓకె అయ్యిందనుకున్న సమయంలో విక్రమ్, సుమల ప్రేమకథ అర్థాంతరంగా ముగిసిపోతుంది.అలా ఆ బాధను మర్చి పోయే ప్రయత్నంలోనే ఐదేళ్లు గడిచిపోతాయి. విక్రమ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఆ వయసుల్లో ఉండే దూకుడుతో కాలేజీలో గ్యాంగ్ మెయిన్టైన్ చేస్తూ గొడవలు, సస్పెన్ష్లతో హీరోయిజం చూపిస్తుంటాడు. అదే సమయంలో కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయిన సితార వెంకటేషన్(శృతిహాసన్)తో మరోసారి ప్రేమలో పడతాడు. కానీ విధి మరోసారి విక్రమ్ జీవితంతో ఆడుకుంటుంది. విక్రమ్, సితారల ప్రేమ కథ కూడా మధ్యలోనే ముగిసిపోతుంది.అలా మరికొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. విక్రమ్ ఎస్ రెస్టో పేరుతో రెస్టారెంట్ స్టార్ చేసి లైఫ్లో సెటిల్ అవుతాడు. కానీ సితార జ్ఞాపకాలు మాత్రం విక్రమ్ను వెంటాడుతూనే ఉంటాయి. ఆ సమయంలో మరోసారి విక్రమ్ మనుసును ప్రేమ పలకరిస్తుంది. సింధు(మడోనా సెబాస్టియన్), విక్రమ్ జీవితంలోకి వచ్చిన మరో(మూడో) ప్రియురాలు. అసలు విక్రమ్ జీవితంలోకి వచ్చిన సింధు ఎవరు..? ఈ మూడో ప్రేమకథ అయినా సుఖాంతం అయ్యిందా..? అన్నదే మిగతా కథ.

సాంకేతిక నిపుణులు : లవ్‌లో గెలిస్తే అమ్మాయి మనతో ఉంటుంది.. ఓడితే ఆ జ్ఞాపకాలు మనతో ఉంటాయని చెప్పే ఓ అందమైన మూవీ ఇది. ఒక విధంగా చెప్పాలంటే 12 ఏళ్ల కిందట రవితేజ నటించిన ‘నా ఆటోగ్రాఫ్’ లాంటి మూవీ. యాక్టింగ్ పరంగా ఈ సినిమాతో 100శాతం మార్కులు సాధించాడు నాగచైతన్య. కెరీర్‌లో బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. మూడు లవ్‌స్టోరీల్లో బాగా ఒదిగిపోయాడు. స్కూల్ ఏజ్, కాలేజ్ కుర్రాడిగా, లైఫ్‌లో సెటిల్ అయిన తరువాత వచ్చే మెచ్యూరిటీ లాంటి వేరియేషన్స్ను బాగా చూపించాడు డైరెక్టర్. మిగిలిన ఇద్దరు హీరోయిన్లతో పోలిస్తే శృతిహాసన్‌ ఎక్కువసేపు కనిపిస్తుంది. అనుపమ ఓన్ డబ్బింగ్ కాస్త ఇబ్బంది పెట్టినా, నటన పరంగా ఆకట్టుకుంది. మడోనా సెబాస్టియన్‌ తన పరిధి మేరకు నటించింది. ఇతర రోల్స్‌లో ప్రవీణ్, కృష్ణచైతన్య, శ్రీనివాస్ రెడ్డి, నోయల్, 30 ఇయర్స్ పృథ్విలు మెప్పించారు. ఇక మెగాస్టార్, నందమూరి హీరోల సినిమాల మాదిరిగానే.. విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునల గెస్ట్ రోల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. నాగార్జున వాయిస్‌ ఓవర్‌ కూడా సినిమాకి ప్లస్ పాయింట్. మరో ఎసెట్ మ్యూజిక్, కెమెరా వర్క్ బాగుంది. ‘ఎవరే’ పాట సూపర్బ్‌గా ఉంది. స్టోరీలో ఎక్కడా మలయాళ మూవీ అన్న ఫీలింగ్ రాకుండా తెలుగు నేటివిటికీ మార్పులు బాగున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే చందూ మొండేటి మంచి విజయం సాధించాడు. నిర్మాణం విలువలు కూడా బాగున్నాయి. దసరాకి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ప్రేమమ్‌కి అదనపు అట్రాక్షన్.

Total Views: 1632 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మరోసారి కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి