టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి!

చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసి టీడీపీ నుంచి బహిష్కరింపబడిన నేత మోత్కుపల్లి నరసింహులు మరో మరు చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేసారు. రాజకీయ వ్యవస్థలో చీడపురుగు అని ఆయన ఆరోపించారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబు ,రేవంత్ లు దొరికిన దొంగలని, అయినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఓటమి తద్యమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడారుకాని, చంద్రబాబు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఓడిపోవాలని తాను తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లి మొక్కుకుంటానని ఆయన చెప్పారు.చంద్రబాబు ప్రభుత్వం తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని ఆయన అన్నారు.

Total Views: 216 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

శ్రీకాకుళం ప్రజల కష్టాలు చూసి కన్నీళ్ళొచ్చాయి : పవన్ కళ్యాణ్

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసంతో జరిగిన నష్టం