మోడీ వ్యూహంలో చిక్కుకున్న వెంకయ్య నాయుడు!

తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, ఆపై తెలుపు చొక్కా.. పెదాలపై ఎప్పుడూ తొణికిసలాడే చిరునవ్వు… తన దగ్గరకు ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరించే తత్వం. గ్రామీణ ప్రాంతంలో పుట్టి జాతీయ నేతగా ఎదిగిన ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేశారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న ఆయన చదువుకున్న విశ్వవిద్యాలయానికే చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ప్రారంభమైన వెంకయ్య ప్రస్థానం బీజేపీ జాతీయ అధ్యక్ష స్థాయికి చేరింది. కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో ఎన్నో పదవులు చేపట్టిన వెంకయ్య మోదీ కేబినెట్‌లో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

దేశ రాజకీయాల్లో మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న తెలుగు తేజం ముప్పవరపు వెంకయ్య నాయుడు మోడీ కేబినేట్ లో పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని చవట పాలెంకు చెందిన వెంకయ్య నాయుడు రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో రెండోసారి మంత్రి పదవి అధిష్టించారు. వాజ్ పేయి ప్రభుత్వం లో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా విశేష సేవలందించిన వెంకయ్య ఆ తర్వాత పదేళ్ల పాటు దేశ వ్యాప్తంగా ఊరూరూ తిరిగి బీజేపీ బలోపేతానికి అహర్నిషలు పాటుపడ్డారు.

దక్షిణాదిలో బీజేపీకి పెద్దదిక్కయిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడంపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వెంకయ్యకు ఇష్టం లేకున్నాఆయన వ్యతిరేక వర్గం వత్తిడితోనే ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి బలవంతంగా ఎంపిక చేశారనే విమర్శ కమలం పార్టీలో వినిపిస్తోంది. ఇది వెంకయ్య నాయుడుకి ప్రమోషనా.. లేక డిమోషనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్ర్రాల్లో పార్టీ తరఫున కర్రపెత్తనం చేసే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతికి అభ్యర్థిగా ఎంపిక కావడంపై పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం ఆనంద పడుతోందనే మాట వినిపిస్తోంది. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎదగదని ఆ వర్గం హైకమాండ్ కి బలంగా వినిపించారు. మోడీ-అమిత్ షా ద్వయం తెలుగు రాష్ట్రాలకు వచ్చినపుడల్లా వెంకయ్య వ్యతిరేక వర్గంగా పేరున్నవాళ్లతోపాటు, RSS కీలక నేతలు సైతం అదే పాట పాడారనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ఆర్నెల్లుగా వెంకయ్యకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండే పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది.వెంకయ్యనాయుడుని ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా ఎంపిక చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు జరగవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక తెలంగాణలోనూ ఆయన వ్యతిరేక వర్గీయుడిగా పేరున్న జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుకు పార్టీలో ప్రాధాన్యత పెరగనుందని కమలం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 

వెంకయ్య నాయుడుని కాదని రెండు రాష్ట్ర్రాల్లో ఏమి చేయలేక.. సొంతంగా నిర్ణయం తీసుకోలేక పార్టీ నేతలు అనేక అవస్థలు పడ్డారనే టాక్ ఉండేది. మర్రిచెట్టు వంటి వెంకయ్య నీడ నుంచి బయటపడనున్న బీజేపీకి ఇక తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు బాగుపడనుందనే ప్రచారం పెరుగుతోంది. 

ఇక బిజెపి విషయానికి వస్తే.. ఏపి లో బిజెపి ఎదుగుదలకి వెంకయ్య పెద్ద అడ్డుగా ఉన్నమాట నిజం. దేశంలో ఇతర రాష్ట్రాలలో వెంకయ్య బిజెపి కి సేవ చేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆయన ప్రాధాన్యత తన కులానికే అన్నది సుస్పష్టం. ఏపి లో బిజెపి ఎదగాలని వెంకయ్య ఏమాత్రం అనుకున్నా నోటిలో నాలుకలేని, ముఖ్యమంత్రి చంద్రబాబు కులానికే చెందిన కంభంపాటి హరిబాబుని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగనిచ్చే వారు కాదు. సోము వీర్రాజు తెదేపాని గట్టిగా విమర్శిస్తున్నారని ఇది తెదేపా బిజెపి దోస్తీకి మంచిది కాదని భావించిన వెంకయ్య సోము వీర్రాజు ని అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్నారని బిజెపి వర్గాలు అంటున్నాయి. కాపు కులానికి చెందిన ఎవరికైనా బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే బిజెపి కి ఎదిగే అవకాశం ఉండేది. ఇప్పుడు వెంకయ్యకి ఇష్టం లేకపోయినా ఆయనకి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి పక్కనబెడుతున్నారు కాబట్టి, ఇప్పుడు అమిత్ షా ఏపి లో బిజెపి బలోపేతంపై దృష్టి పెట్టవచ్చు. ఈ రకంగా చూస్తే, వెంకయ్యకు పదోన్నతి ద్వారా ఏపి బిజెపి కి అడ్డు తొలగిందని అనుకోవచ్చు.

Total Views: 1014 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా