జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!

జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. కాగా గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు కూడా జలీల్ ఖాన్ చెప్పిన సంగతి తెలిసందే.

కాగా ఇదిలాఉంటే చంద్రబాబు నాయుడిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జలీల్ ఖాన్ మండిపడ్డారు. బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన విజయ మాల్యాకు సహకరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి నాన్‌ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండని కేంద్రానికి సూచించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకి పేరులోనే పెద్ద కన్నం ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. అప్పట్లోనే కన్నా.. రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచేశారని జలీల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Total Views: 102 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ