అమితాబ్, రామోజీరావు సరసన పవన్!

ఎన్టీవీ నరేంద్ర చౌదరి విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను మెగాస్టార్‌ చిరంజీవి స్వీకరించారు. తన ఇంట్లోని గార్డెన్‌లో ఇవాళ ఆయన మూడు మొక్కలు నాటారు. ఎన్టీవీ అధినేత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ఈ మొక్కలు నాటానని చెప్పిన మెగాస్టార్‌.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘చాలా సంతోషంగా ఉంది. ఛాలెంజ్‌ విసిరి నా చేత ఓ మంచి హరిత కార్యక్రమం చేయించినందుకు ఎన్టీవీ చౌదరిగారికి ధన్యవాదాలు’ అని మెగాస్టార్‌ అన్నారు. అనంతరం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చిరంజీవి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ గ్రీన్ ఛాలెంజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మెగాస్టార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Total Views: 937 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఎన్టీఆర్ సోదరుల సాయం!

‘తితలీ’ బాధితులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విరాళం ప్రకటించి