వరంగల్‌లో 10 మంది కార్మికుల సజీవదహనం

వరంగల్‌ కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్‌ వర్స్క్ గోదాంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురై గుర్తుపట్టలేని విధంగా మారాయి. శిథిలాల కింద మరో రెండు, మూడు మృతదేహాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.విశ్వనాథర్‌ రవీందర్‌, డీసీపీ, ఏసీపీ తదితరులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

కోటిలింగాలలోని భద్రకాళి ఫైర్‌ వర్క్స్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీ శబ్దాలతో బాణసంచా పేలింది. ఆ సమయంలో గోదాములో 25 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే పలువురు కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. 10మంది కార్మికులు మంటల్లో సజీవ దహనమయ్యారు. మరికొంత మంది ఆచూకీ తెలియకపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు విషయం తెలుసుకుని వెంటనే ప్రమాదస్థలానికి పరుగులు తీశారు. కార్మికుల మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Total Views: 169 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రక్షించాల్సిన ఖాకినే..లైంగిక వేధింపులు!

న్యాయాన్ని రక్షించాల్సిన ఖాకి నిస్సహాయ స్థితిలో ఉన్న అడపడుచును లైంగిక