అనుమానపు మంటల్లో యువతి

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఓ కుమారుడు జన్మించాడు. కాలచక్రం మూడేళ్లు తిరిగింది. ప్రేమ స్థానంలో అనుమానం పురుడుపోసుకుంది. చివరికి అది ఆ ఇల్లాలిని నిలువునా కాల్చేసింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను సజీవ దహనం చేసి పరారైన ఘటన హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో మంగళవారం వేకువజామున జరిగింది. పంజాబ్‌కు చెందిన సానియా బేగం నాలుగేళ్ల కిందట జీవనోపాధి కోసం నగరానికి వచ్చింది. నాగోల్‌లో ఉంటూ శివారులోని ఓ పబ్‌కు చెందిన ఆర్కెస్ట్రాలో నర్తకిగా పనిలో చేరింది. అదే బృందంలో పనిచేస్తున్న సంతోష్‌నగర్‌లోని ఖలందర్‌ నగర్‌కు చెందిన షేక్‌ సల్మాన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు, స్నేహితుల సమక్షంలో మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు జన్మించాడు. వృత్తిరీత్యా ఇద్దరూ అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తుండడంతో కుమారుడి సంరక్షణను సల్మాన్‌ తన తల్లిదండ్రులకు అప్పగించాడు. కుటుంబ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత ఆర్జించే ఉద్దేశంతో ఆమె కొంత కాలంగా పబ్‌లో నృత్యంతో పాటు.. పాటలు కూడా పాడుతోంది. ఎక్కువ సమయం అక్కడ ఉండేది. ఇదే దంపతుల మధ్య అనుమానాలకు కారణమైంది. ఈ పరిణామాలతో దంపతులు ఆర్నెల్ల క్రితం ఒవైసీ కాలనీలోని అద్దె ఇంట్లోకి మారారు. తాను ఇంట్లో లేని సమయంలో భార్య చరవాణిలో ఎక్కువ సేపు మాట్లాడుతున్నట్టు గుర్తించిన సల్మాన్‌ ఆమెపై మరింత అనుమానం పెంచుకున్నాడు.

మద్యం తాగించి హత్య
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దంపతులు ఇంటికి వచ్చారు. ‘మద్యం మత్తులో ఉన్న సల్మాన్‌ భార్యతోనూ బలవంతంగా మద్యం తాగించాడు. 1.30 గంటల ప్రాంతంలో మత్తులో ఉన్న భార్య కాళ్లు, చేతులను తాడుతో కట్టేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన పక్కింట్లోని వ్యక్తి బుధవారం వేకువజామున సమాచారం అందించడంతో ఘోరం వెలుగులోకి వచ్చిందని సంతోష్‌ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భోజ్యానాయక్‌ వెల్లడించారు. సల్మాన్‌ ఓ హత్య కేసులో నిందితుడని, పహడీ షరీఫ్‌ పోలీసులు ఐదేళ్ల క్రితం సల్మాన్‌ను అరెస్ట్‌ చేశారని ఆయన తెలిపారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది.

Total Views: 288 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నటి భానుప్రియపై పోలీసు కేసు

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్