పెళ్లి ఆపేసిన స్పీడ్ పోస్ట్..!

మొన్న ఓ వధువు స్నేహితుడు వరుడికి ఫోటో పంపించి పెళ్లి ఆపించేసిన సంఘటన మరవక ముందే ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ఘటన చేసుకుంది.తెల్లారితే పెళ్లికి రెడీ కావాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి వద్దని ఆపించేశాడు. అందుకు కారణం ఒక స్పీడ్ పోస్ట్ రావడం. అది విప్పి చుసిన వరుడు వెంటనే పెళ్లి వద్దని చెప్పేశాడు.

అసలు వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్‌ అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడిలో చోటు చేసుకున్న ఈ ఘటన గ్రామస్థులను ఆశ్చర్యానికి లోను చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన యువకుడికి స్థానికంగా ఉండే యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఇరుకుటుంబాల సభ్యులు అన్ని పనులను పూర్తి చేసుకున్నారు. తెల్లారితే పెళ్లి పీఠలు ఎక్కాల్సిన వరుడికి ఊహించని విధంగా ఓ షాక్ తగిలింది. పెళ్లికి ముందు రోజు వరుడికి ఒక స్పీడ్ పోస్ట్ వచ్చింది.

వచ్చిన మొబైల్ లో వీడియో చూడాలని రాసి ఉంది. దాన్ని చుసిన వరుడు షాక్ అయ్యాడు. అందులో వధువు స్నానం చేస్తున్నట్లు అలాగే దుస్తులు మార్చుకున్నట్లు ఒక వీడియో ఉండడంతో అతను పెళ్లి చేసుకోను అని చెప్పేశాడు. దీంతో పోలీసులకు సమాచారం అవ్వగా విచారణ చేపట్టిన పోలీసులు అవి మార్ఫింగ్ వీడియోలు అని తేల్చారు. వచ్చిన కొరియర్ ద్వారా నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

 

Total Views: 396 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రక్షించాల్సిన వాడే భక్షించాడు! తిరుపతిలో కామాందుడు!

ప్రభుత్వ బాలికల వసతి గ‌ృహంలో ఓ కామాంధుడి లీలలు బయటపడుతున్నాయి.